యామీ గౌత‌మీని న‌టిగా ప‌నికిరాద‌న్నారు!

Update: 2022-04-08 10:33 GMT
అప్పుడప్పుడు నెగిటివ్ రివ్యూల్ పై హీరోలు..ద‌ర్శ‌క‌..నిర్మాత‌లు అంతెత్తున లేచిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. సినిమాని రివ్యూ చేసే క్ర‌మంలో విశ్లేష‌ణ అనేది చాలా ర‌కాలుగా ఉంటుంది.  దాదాపు అన్ని కోణాల్లోనూ సినిమా విశ్లేష‌ణ అనేది ఉంటుంది. మంచి..చెడులు..సినిమాలో ప్ల‌స్ లు..మైన‌స్ లు..న‌టీన‌టుల పెర్పార్మెన్స్....టెక్నిక‌ల్ విభాగం ప‌నితీరు ఇలా అన్నింటిని విశ్లేషించి ఫైన‌ల్ ర్రివ్యూ రిపోర్ట్ ఒక‌టి వ‌స్తుంది.

వీటిని  కొంత మంది పాజిటివ్ గా తీసుకుంటారు. ఇంకొంత మంది అంతే సీరియ‌స్ గాను తీసుకుంటారు. అలాంట‌ప్పుడు క్రిటిక్స్ విమ‌ర్శ‌లు ఎదుర్కోక త‌ప్ప‌దు. స‌రిగ్గా ఇదే పరిస్థితి ఓ హీరోయిన్ నుంచి ఎదురైంది ఓ రివ్యూ రైట‌ర్ కి. యామీ  గౌత‌మి..అభిషేక్ బ‌చ్చ‌న్.. నిమ్ర‌త్ కౌర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తుషార్ జ‌లోట ద‌ర్శ‌క‌త్వంలో  తెర‌కెక్కిన 'ద‌స్వీ' ఏప్రిల్ 7న ఓటీటీలో రిలీజ్ అయింది.

అయితే ఈ సినిమాకి డివైడ్ టాక్ వ‌చ్చింది. ఇంకొన్ని బాలీవుడ్  వెబ్ సైట్స్  దారుణ‌మైన రేటింగ్స్ ఇచ్చాయి. ఈ నేప‌థ్యంలో యామీ గౌత‌మి ఓ పోర్ట‌ల్ రివ్యూని త‌న‌దైన శైలిలో తిప్పికొట్టింది. ఈ వెబ్ సైట్ యామీ గౌత‌మ్  న‌ట‌న‌ని టార్గెట్ చేసి క్రిటిసైజ్ చేసింది.

''ఇంత కాలం చేసిన సాధార‌ణ ప్రియురాలి పాత్ర‌ల‌కు యామీ ఈ సినిమాతో పుల్ స్టాప్ పెట్టింద‌ని.. ఈ సినిమాలో ఆమె న‌ట‌న గ‌తంతో పోలిస్తే ప‌ర్వాలేద‌ని రాసుకొచ్చింది. అంటే ఇప్ప‌టివ‌ర‌కూ యామీ గౌత‌మి చేసింది న‌ట‌న కాదు అని ఏదో అలా న‌టిగా బండి న‌డిపించింది అన్న మీనింగ్ తో రాసుకొచ్చారు. దీంతో యామీ గౌత‌మి ఆ వెబ్ సైట్ పై నిప్పులు చెరిగింది.

మంచి రివ్యూల్ని  స్వీక‌రిస్తాను. కానీ ఇలాంటి రివ్యూల‌పై నోరు క‌చ్చితంగా విప్పాలి. విమ‌ర్శ‌ల‌కి విలువ ఇస్తాను. వాటిలో వాస్త‌వాల్ని గ్ర‌హించి త‌ప్పులు స‌రి చేసుకుంటాను. కానీ  కొంత మంది కావాల‌నే టార్గెట్ చేస్తున్నారు. అర్ధం లేని వ్యాఖ్య‌ల‌తో దిగ‌జార్చాల‌ని చూస్తున్నారు. అలాంటి వాటిని త‌ప్ప‌కుండా తిప్పికొట్టాలి. వచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ..ఎన్నో క‌ష్టాల్ని ఓర్చి ఈ స్థాయికి వ‌చ్చాను.

'బాలా'..'ఉరి' లాంటి సినిమాలు చేసాను. కానీ ఇంత కాలం నేను చేసిన ప‌నిని కూడా విమ‌ర్శించారు. ఈ విధ‌మైన కామెంట్లు అమ‌ర్యాద‌ప‌ర్వ‌కం. ఇప్ప‌టివ‌ర‌కూ మీ పోర్ట‌ల్ ని ఫాలో అయ్యాను.  ఇక‌పై మిమ్మ‌ల్ని ఫాలో అవ్వాల‌నుకోవ‌డం  లేదు. అలాగే నా గురించి రివ్యూలు కూడా  రాయ‌కండి' అని యామీ గౌత‌మ్ మండిప‌డింది. యామీ అవేద‌న లో అర్ధ‌ముంది. ఆమె మొత్తం న‌ట జీవితాన్నే కించ‌ప‌రిచేలా అందులో వ్యాఖ్యానించ‌డం భావ్య‌మైంది కాదు. మ‌రి యామీ ఆవేద‌న‌పై స‌ద‌రు వెబ్ సైట్ వివ‌ర‌ణ ఇస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News