తుపాకీ పేల్చి ఫినిష్ చేసిన 'విక్ర‌మ్'!

Update: 2022-03-02 05:49 GMT
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన్ `విక్ర‌మ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. `ఖైదీ`..`మాస్ట‌ర్` చిత్రాల‌తో బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ లు అందుకున్న లోకేష్ క‌న‌గ‌రాజ్ ప్ర‌తిభ‌ను మొచ్చి క‌మ్ ఇచ్చిన అవ‌కాశం ఇది.

స్ర్కిప్ట్ ద‌శ‌లోనే క‌మ‌ల్ ని మొప్పించి ప్ర‌శంస‌లందుకున్నాడు. దీంతో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ప్ర‌క‌ట‌న ద‌గ్గ‌ర నుంచి అంచనాలు మొద‌ల‌య్యాయి. ఇక క‌మ‌ల్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ గ్లాన్స్ కి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రెస్పా్స్ వ‌చ్చింది. ఆ రెస్పాన్స్ తో సినిమాపై అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి.

ఇక ఇందులో ప్ర‌ధాన విల‌న్ గా విజ‌య్ సేతు ప‌తి న‌టించ‌డం సినిమాకి మ‌రో హైలైట్. మ‌రో కీల‌క పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టుడు ప‌హ‌ద్ పజిల్ న‌టిస్తున్నాడు. ఇలా సినిమాలో బెస్ట్ పెర్పార్మ‌ర్లు అంతా భాగం కావ‌డం తో `విక్ర‌మ్` పై అసాధార‌ణ‌మైన అంచ‌నాలు నెల‌కొంటున్నాయి. తాజాగా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తిచేసింది. ఈ  విష‌యాన్ని ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ ట్విట‌ర్ ఖాతా  ద్వారా తెలిపారు.  ``విక్ర‌మ్ షూటింగ్ కోసం 110 రోజుల పాటు మా టీమ్ అంతా ఎంతో క‌ష్ట‌ప‌డి ఇష్ట‌ప‌డి ప‌నిచేసింది.  వారి అసాధార‌ణ‌మైన కృషికి ధ‌న్య‌వాదాలు. క‌మ‌ల్ హాస‌న్..విజ‌య్ సేతుప‌తి..ప‌హ‌ద్ పాజిల్..అనిరుద్ # విక్ర‌మ్ అని లోకేష్ ట్వీట్ చేసారు.  

అలాగే చివ‌రి రోజు షూటింగ్ కి సంబంధించిన చిన్న వీడియోను కూడా పంచుకున్నారు. ఇందులో ప‌హిద్ ప‌సిల్ తుపాకీ పేల్చుతున్న దృశ్యం క‌నిపిస్తోంది. ఆ ప‌క్క‌నే లోకేష్ క‌న‌గ‌రాజు  ఉన్నాడు. మ‌రోవైపు సినిమాకి సంబంధించిన టీమ్ స‌భ్యులు ఉన్నారు.  `షూటింగ్  ముగిసిందని లోకేష్ తెలియజేసినప్పుడు.. ఫహద్ “పార్టీ లేదా పుష్పా?” అని అడిగాడు. ఇది వీడియోలో హైలైట్.   

స్టార్ కాస్ట్‌తో పాటు.. ఈ చిత్రంలో కాళిదాస్ జయరామ్.. నరైన్.. అర్జున్ దాస్ - శివాని నారాయణన్ కూడా సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.  ఇక  `విక్ర‌మ్` లో  కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా.. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి  చిత్ర నిర్మాణంలో  భాగ‌మ‌య్యారు.

ఈ యాక్ష‌న్ థ్రి్ల‌ర్ ని అన్ని ప‌నులు పూర్తి చేసి వేస‌వి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామ‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు.  అభిమానుల అంచ‌నాలకు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉంటుంద‌ని లోకేష్ చెప్ప‌క‌నే చెప్పారు. ఆయ‌న గ‌త సినిమా `ఖైదీ` మాస్ స‌స్సెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్  కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ పెద్ద స‌క్సెస్ అయింది. ఆ సినిమాతో  లోకేష్ కి సౌత్ లో మంచి పేరొచ్చింది. ఆ త‌ర్వాత విజ‌య్ `మాస్ట‌ర్` సినిమాతో అవాక‌శం ఇచ్చారు. అటుపై క‌మ‌ల్ హ‌స‌న్ అందే పంథాలో ఛాన్స్ ఇచ్చారు.









Full View




Tags:    

Similar News