టాలీవుడ్ లో వున్న స్టార్ ప్రొడ్యూసర్లలో మెగా ప్రొడ్యూసర్, మాస్టర్ మైండ్ అల్లు అరవింద్ శైలి ప్రత్యేకం. ఆయన ఏం ప్లాన్ చేసినా ఫ్లాప్ అన్న మాట ఇంత వరకు వినలేదు. డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా, ప్రొడ్యూసర్ గా ఎన్నో విజయాల్ని సొంతం చేసుకున్నారు. పక్కా ప్రణాళికతో ప్యూహం పన్నానంటే అదే బ్లాక్ బస్టర్ అయి తీరాల్సిందే..ఇది ఇండస్ట్రీ జనాల మాట. అలాంటి స్టార్ ప్రొడ్యూసర్ మైహోమ్ గ్రూప్ తో కలిసి తొలి తెలుగు ఓటీటీ `ఆహా`ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే.
మొదట్లో పెదవి విరుపులు, విమర్శలు విన్న అల్లు అరవింద్ తనదైన ప్యూహాత్మక అడుగులతో దిగ్గజ ఓటీటీలకు ఏ మాత్రం తగ్గని రీతిలో టాప్ లో నిలబెట్టి ఔరా అనిపించారు. ఇతర ఓటీటీలకు పూర్తి భిన్నమైన ప్లాన్ లతో వీక్షకుల్ని ఎట్రాక్ట్ చేస్తూ వెళుతున్న అల్లు అరవింద్ ఓటీటీల్లో టాక్ షోలకు శ్రీకారం చుట్టారు. మొదట్లో ఒకటి రెండు టాక్ షోలని మొదలు పెట్టినా.. స్టార్ లని అందులో భాగస్వామ్యం చేసినా అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
సామ్ తో `సామ్ - జామ్`, వైవా హర్షాతో మరో టాక్ షో.. ప్లాన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో `ఆహా` టాక్ షో ఫ్లాప్ అనే కామెంట్ లు వినిపించాయి. ఆ కామెంట్ లకు ధీటుగా ఎవరూ ఊహించని హోస్ట్ ని రంగంలోకి దింపి `అన్ స్టాపబుల్` అంటూ సరికొత్త టాక్ షోకు శ్రీకారం చుట్టారు. ఈ షోతో నందమూరి బాలకృష్ణ తొలి సారి హోస్ట్ గా మారి సెలబ్రిటీలతో ఓ ఆట ఆడుతున్న విషయం తెలిసిందే. పబ్లిక్ మీటింగ్ లలో తత్తపపాటుకు గురై ట్రోలర్ ల చేతికి చిక్కి వైరల్ అయి షాకిచ్చిన బాలయ్య `అన్ స్టాపుబుల్` లో మాత్రం తనదైన పంచ్ లతో ఆడేసుకున్నారు.
దీంతో ఎవూ ఊహించని విధంగా `ఆహా` మొదటు పెట్టిన `అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె` బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. హోస్ట్ గా బాలయ్య తిరుగులేని ఇమేజ్ ని అందించడమే కాకుండా ఐఎండీబీ సైట్ లో రికార్డు రేటింగ్ ని సొంతం చేసుకున్న మోస్ట్ పాపులర్ షోగా నిలిచింది. అయితే సీజన్ 2 అంత క్రేజ్ ని దక్కించుకోవడం కష్టమనే కామెంట్ లు వినిపించాయి. ఈ నేపథ్యంలో మెగా ప్రొడ్యూసర్, మాస్టర్ మైండ్ అల్లు అరవింద్ తనదైన మార్కు స్కెచ్ తో సీజన్ 2 కోసం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని రంగంలోకి దింపడం,
గత కొన్నేళ్లుగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న పలు అంశాల చుట్టూ ఈ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ సాగడం, నారా లోకేష్ కూడా మధ్యలో షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎన్నడూ లేనంత హైప్ సీజన్ 2 పై ఏర్పడింది. ఏ అంశాలతే చర్చగా మారి సీజన్ 2ని వైరల్ అయ్యేలా చేస్తాయని అల్లు అరవింద్ స్కెచ్ వేశారో అదే ఇప్పడు సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా చేయడం విశేషం.
దీంతో రానున్న ఎపిసోడ్ లపై మరింత క్రేజ్ ఏర్పడింది. బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు తొలి సారి ఒకే షోలో పాల్గొనడం, అత్యంత చర్చనీయాంశంగా మారిన వివాదాస్పద అంశాలని చర్చించడంతో `అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె` సీజన్ 2 బ్లాక్ బస్టర్ గా నిలడంతో మెగా ప్రొడ్యూసర్ స్కెచ్ వేస్తే అది బ్లాక్ బస్టరే! అని మరోసారి రుజువైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.