`బాహుబలి` తరువాత టాలీవుడ్ లో పాన్ ఇండియా చిత్రాల పరంపర మొదలైంది. ఏ హీరోని కదిలించినా ఒకే మాట పాన్ ఇండియా.. పాన్ ఇండియా.. ప్రస్తుతం తెలుగులో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే `రాధేశ్యామ్` పాన్ ఇండియా వైడ్ గా విడుదలై రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ని రాబట్టింది. త్వరలో మరి కొన్ని చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఇందులో అత్యధిక శాతం బాలీవుడ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుంటూ హీరోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇటీవల అల్లు అర్జున్ నటించిన `పుష్ప` బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా వసూళ్ల పరంగానూ చరిత్ర సృష్టించింది.
ఈ చిత్రానికి ఉత్తరాదిలో 100 కోట్లకు మించి వాసూళ్లు రావడం గమనార్హం. ఇదే ఇప్పడు మన హీరోలని మరింత ఎలర్ట్ చేసిందని తెలుస్తోంది. ఈ మూవీకి సీక్వెల్ గా రానున్న `పుష్ప 2` లో ఉత్తరాది ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తాజా చిత్రం కోసం ఏకంగా బాలీవుడ్ డైరెక్టర్ ని రంగంలోకి దింపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
`ఆర్ ఆర్ ఆర్` కోసం దాదాపు మూడున్నరేళ్లు కేటాయించిన రామ్ చరణ్ ఈ మూవీ రిలీజ్ అవుతుండటంతో తనతదుపరి చిత్రాన్ని మొదలుపెట్టేశాడు. RC15 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. `ఒకే ఒక్కడు` తరహాలో సాగే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. దిల్ రాజు , శిరీష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రారంభమై కీలక ఘట్టాలని పూర్తి చేసుకుంది.
పిరియాడిక్ డ్రామాగా ప్రజెంట్ అండ్ పాస్ట్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో హీరో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నారు. తండ్రి పాత్రకు సంబంధించిన లుక్, విజువల్స్ నెట్టింట లీక్ కావడంతో వైరల్ గా మారాయి. రిలీజ్ కి ముందే సంచలనాలు సృష్టిస్తూ హాట్ టాపిక్ గా మారిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఈ చిత్రం కోసం ప్రత్యేక శ్రద్ధని కనబరుస్తున్నారు.
ఇందులో భాగంగా అక్షయ్ కుమార్ తో `బచ్చన్ పాండే` చిత్రాన్ని రూపొందించిన ఫాహద్ సమ్జీని హిందీ డబ్బింగ్ వెర్షన్ కు డైలాగ్స్ అందించడానికి ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది. ఫాహద్ సమ్జీ RC15 ఇందీ వెర్షన్ కు మరింత ప్లస్ గా మారే అవకాశం వుందని, ఈ మూవీ హిందీ బెల్ట్ లో మరింతగా ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశాలు వున్నాయని మేకర్స్ భావిస్తున్నాట. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. విలన్ గా ఎస్. జె. సూర్య నటిస్తుండగా కీలక పాత్రల్లో జయరామ్, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర నటిస్తున్నారు.