టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజుకున్న పేరు, పాపులారిటీ, ఆయన జడ్జిమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జనం పల్స్ తెలిసిన ప్రొడ్యూసర్ గా ఆయన చాలా సందర్భాల్లో రుజువు చేసుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ వరుస క్రేజీ ప్రాజెక్ట్ లు నిర్మిస్తూ ఫుల్ బిజీగా వున్నారు. అలాంటి దిల్ రాజు ఇప్పడు టెన్షన్ పడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంతకీ జనం నాడీ తెలిసిన దిల్ రాజు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వివరాల్లోకి వెళితే...కరోనా తరువాత గత కొన్నినెలలుగా ప్రేక్షకుల మైండ్ సెట్ లో మార్పులు మొదలయ్యాయి. దీంతో సినిమా బాగుందన్న టాక్ వినిపిస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. అది కూడా సెలక్టివ్ సినిమాలకే వస్తున్నారు. ఎంత పెద్ద స్టార్ సినిమా, క్రేజీ ప్రొడక్షన్ కంపనీ సినిమా అయినా సరే ఆడియన్స్ ప్రధాన ప్రియారిటీ కంటెంట్ కే ఇస్తున్నారు. ఫరవాలేదని టాక్ వచ్చిన సినిమాలని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సినిమా అత్యథిక భాగం బోర్ కొట్టకుండా చాలా క్రిస్మీగా వుండేలా నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.
అయితే ఇంత చేసినా జనం మాత్రం పెద్దగా థియేటర్లకు రాకపోవడం పలువురు స్టార్ ప్రొడ్యూసర్లని టెన్షన్ కు గురిచేస్తోందట. ఇదే తరహాలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా టెన్షన్ పడుతున్నారట. కారణంగా ఆయన నిర్మించిన `థాంక్యూ` సినిమా అని చెబుతున్నారు. నాగచైతన్య హీరోగా నటించిన ఈ మూవీని విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించారు. రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్ లుగా నటిచారు. ఓ యువకుడి వివిధ దశల్లో సాగే విభిన్నమైన కథగా ఈ మూవీని నిర్మించారు.
ఈ మూవీ విషయంలో ముందు నుంచి దిల్ రాజు పెద్దగా ప్రమోషన్స్ చేయడం లేదంటూ రైటర్ బీవీఎస్ రవి ఓపెన్ గా వెల్లడించిన నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం తాజా బయటికి వచ్చింది. సినిమా రన్ టైమ్ విషయంలో దిల్ రాజు టెన్షన్ పడుతున్నారని, ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 50 నిమిషాలు వుందని, అదే దిల్ రాజును టెన్షన్ కు గురిచేస్తోందని ఇన్ సైడ్ టాక్. ఆ టెన్షన్ కారణంగానే ఈ మూవీ రన్ టైమ్ ని రీసెంట్ గా 41 నిమిషాలు తగ్గించి 2 గంటల 9 నిమిషాలకు కుదించారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఈ మూవీని ప్రమోషన్స్ పరంగా దిల్ రాజు పట్టించుకోవడం లేదని మీడియా సాక్షిగా వెల్లడించిన రైటర్ బీవీఎస్ రవి తాజాగా రన్ టైమ్ గురించి బయట పెట్టడం గమనార్హం.
దీంతో మొదటి నుంచి దిల్ రాజు ఈ మూవీ విషయంలో అంటి ముట్టనట్టుగా వ్యవహరించినట్టుగా స్పష్టమవుతోంది. అయితే రిలీజ్ టైమ్ దగ్గరపడే సరికి రన్ టైమ్ విషయంలో టెన్షన్ కు గురైన దిల్ రాజు ఫైనల్ కట్ ని 2 గంటల 9 నిమిషాలకు కుదించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిడివి కోసం కీలక ఘట్టాలకు కత్తెరేశారా? లేదా అన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.