ఎన్టీర్‌ తర్వాత టీం ఇండియా కెప్టెన్ కు ఆ ఘనత

Update: 2022-03-02 08:30 GMT
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒక్కటైన లంబోర్ఘినీ ఊరుస్ కారుని కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. ఆ కారుకు దాదాపుగా ఎన్టీఆర్ ఆన్‌ రోడ్‌ ప్రైజ్‌ మూడున్నర కోట్ల రూపాయలను ఖర్చు చేశాడనే వార్తుల ఆ సమయంలో వచ్చాయి.

ఆ విషయమై అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే బయటకు రాలేదు. ఇండియాలో లంబోర్ఘినీ ఊరుస్ కారు ఉన్న ఏకైక సెలబ్రెటీగా ఎన్టీఆర్‌ ఘనత దక్కించుకున్నాడు.

ప్రపంచంలోనే అరుదైన ఆ కారును ఇప్పుడు టీం ఇండియా కెప్టెన్‌ అయిన రోహిత్‌ శర్మ కొనుగోలు చేశాడు. ముంబయిలోని లంబోర్ఘిని షో రూం వారు ఇటీవలే రోహిత్‌ శర్మకు ఆ కారును డెలవరీ చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇతర విషయాల గురించి వారు ఏమీ తెలియజేయలేదు.. కాని కారు గురించి మాత్రం సోషల్‌ మీడియాలో వెబ్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

క్రికెటర్స్ లో ఈ రేంజ్ కారును కొనుగోలు చేసింది కేవలం రోహిత్‌ శర్మ మాత్రమే. కెప్టెన్ గా ఎన్నిక అయిన తర్వాత అతడు తనకు తాను ఈ కారును బహుమానంగా ఇచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. టీం ఇండియా మేటి ఆటగాళ్లలో ఒక్కడు అయిన రోహిత్‌ శర్మ ఆ స్థాయి కారుకు ఖచ్చితంగా అర్హుడు అంటూ అభిమానులు మరియు క్రికెటర్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ కారు గురించి తెగ చర్చ జరుగుతోంది.

టీం ఇండియా క్రికెటర్‌ ల జెర్సీ కలర్ అయిన బ్లూ నే తన కారు కలర్‌ గా ఎంపిక చేసుకున్నాడు. కంపెనీ ఇచ్చిన ఫెసిలిటీస్ కాకుండా ఇంటీరియర్‌ అత్యంత అద్బుతంగా మార్పించాడట. ఇంటీరియర్‌ మేకింగ్‌ కోసం రోహిత్‌ శర్మ భారీ మొత్తంలో ఖర్చు చేశాడని ముంబయి వర్గాల నుండి సమాచారం అందుతోంది. తన అభిరుచికి తగ్గట్లుగా మరియు సేఫ్టీ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుని ఇంటీరియర్ చేయించారట.

ఇండియాలో ఒకప్పుడు రేంజ్‌ రోవర్‌.. బీఎండబ్ల్యూ ఇంకా కొన్ని కార్లను స్టేటస్‌ సింబల్స్ గా భావించేవారు. కాని ఇప్పుడు లంబోర్ఘిని ని స్టేటస్ అంటున్నారు. ఈ మోడల్‌ కార్లు ఇండియాలో కేవలం వీరిద్దరికి మాత్రమే ఉండటం వారి అభిమానులకు గర్వకారణంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్‌ మాత్రమే కాకుండా ఇప్పుడు రోహిత్‌ శర్మ కూడా లంబోర్ఘినీ ఊరుస్ కారుని కలిగి ఉండటంతో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.
Tags:    

Similar News