హిందువులకి కాశీ, ముస్లింలకి మక్కాలాగా ఐటీ వాళ్ళకి అమెరికా.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కనుక ఒక్క సారైనా అమెరికా కు పోయిరాలేదంటే పల్లెటూర్లో ఉండే పాలేరు కూడా వాడిని వింతగా చూస్తాడు. మరి అలానే హీరోయిన్లకి ఫైనల్ గోల్.. బాలీవుడ్. పైకి ఎంత సోది చెప్పినా బాలీవుడ్ బ్యూటీ అనిపించుకోవాలని - ఖాన్ల సినిమాలో మెయిన్ హీరోయిన్ గా మెరవాలని అందరికీ ఉంటుంది. మరి అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి అందుకేమీ ఎక్సెప్షన్ కాదు.
అందుకే ఆమె ఈమధ్య బాలీవుడ్ కలలని నిజం చేసుకునే ప్రయత్నాలు షురూ చేసిందట. తెలుగులో కొత్త సినిమాలకు సైన్ చేయడం కావాలనే తగ్గించిందని- తమిళ్ ఆఫర్లు వస్తున్నా 'నో' చెప్తోందని - బాలీవుడ్ మేకర్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఆల్రెడీ ఒక బిగ్ ప్రాజెక్ట్ కు సంబంధించి బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ తో డిస్కషన్లు నడుస్తున్నాయట. అంతా ఓకే అనుకుంటే త్వరలో ఈ బ్యూటీ ముంబై ఫ్లైట్ ఎక్కడం ఖాయం.
మరి లావణ్యకు బాలీవుడ్లో భవిష్యత్తు ఎలా ఉంటుంది.. అక్కడ ఆమె నిలదొక్కుకుంటుందా.. లేదంటే గోడకు కొట్టిన బంతిలా మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కుతుందా తెలియాలంటే మనం కొంతకాలం వేచి చూడాలి. మరో వైపు లావణ్య తెలుగులో ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తోంది. అందులో ఒకటి మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ సినిమా కాగా రెండోది యంగ్ హీరో నిఖిల్ సినిమా.