ఫోటో స్టొరీ: పాప హాట్ నెస్ పీక్స్ లో ఉందే

Update: 2019-08-10 07:46 GMT
'అందాల రాక్షసి' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.  ఆ సినిమా తర్వాత మంచి హిట్లు కూడా రావడంతో ఒక దశలో టాప్ హీరోయిన్ లీగ్ లోకి చేరుతుందని కూడా కొందరు అంచనాలు వేయడం జరిగింది. కానీ వరస ఫ్లాపులతో అసలు కెరీరే ఫేడ్ అవుట్ అయ్యే దశకు వచ్చింది.  అయితే తన కెరీర్ లో ఎత్తుపల్లాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో మాత్రం క్వాలిటీలో తేడాలు లేకుండా.. ఒకే స్టాండర్డ్ లో మంటలు పెడుతూనే ఉంది.

తాజాగా లావణ్య ఒక ఫోటోషూట్ చేసింది.  ఈ ఫోటో షూట్ కోసం బేబీ పింక్ శాటిన్ గౌన్ ధరించి వయ్యారం ఒలికిస్తూ కూర్చుంది.  జుత్తు చిందరవందరగా ఉండడంతో సెక్సీనెస్ మరింతంగా పెరిగింది. ఇక ఎక్స్ ప్రెషన్ గురించి చెప్పనవసరం లేదు.. ఆ కళ్ళను చూస్తే ఎవరైనా అందాల రాక్షసికి ఫిదా అయిపోవడం ఖాయం.  అదేదో యాడ్ లో 'పట్టు పట్టు' అని హంగామా చేస్తుంటారు కదా.. అలానే లావణ్య చర్మ లావణ్యం పట్టులా ఉంది.  పట్టు అంటే ఒకటే అర్థం బాబులు.. సిల్క్.  రెండవ మన్మథుడు తరహాలో 'ఆ' పట్టు అనుకునేరు!

ఈ  ఫోటోకు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఓ లైక్ వేసుకుంది.  "ఆగ్ లగా దీ".. "సూపర్ హాట్".. "స్కిన్ టోన్ సూపర్".. "వై సో హాట్" అంటూ కామెంట్లు పెట్టారు. సినిమాల విషయానికి వస్తే లావణ్య చేతిలో ప్రస్తుతం ఒకే సినిమా ఉంది.  అదే నిఖిల్ హీరోగా తెరకెక్కిన  'అర్జున్ సురవరం'.  షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.  ఎప్పుడు అనే క్లిష్టమైన ప్రశ్న అడక్కండి.. అయినప్పుడు!
Tags:    

Similar News