అందాల రాక్షసి అని ముద్దుగా టాలీవుడ్ జనాలతో పిలిపించుకుంటున్న బ్యూటీ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతో ఆకట్టుకోవడం.. తర్వాత వరుసగా హిట్స్-బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకోవడం.. అటు సీనియర్ స్టార్ నాగ్ తో పాటు ఇటు యంగ్ హీరో నానితో ఏకకాలంలో మెప్పించగలగడం వంటివి అమ్మడిని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లిపోయాయి.
అంతవరకూ బాగానే ఉన్నా.. గతేడాది మాత్రం ఈ రాక్షసికి ఏ మాత్రం కలిసి రాలేదు. లావణ్య కనిపించిన సినిమాలన్నీ బోల్తా కొట్టేశాయి. దీంతో ఇప్పుడు కొత్త ఆఫర్లు ఇచ్చేవారు కరువైపోయారు. కానీ అమ్మడికి షాప్ ఓపెనింగ్స్ మాత్రం పిలుపులు బాగానే వస్తున్నాయి. ఇవాళ హైద్రాబాద్ లో ఓ షోరూం ఓపెన్ చేసింది ఈ బ్యూటీ. చీరకట్టుతో ఎంత అందంగా కనిపించవచ్చో చూపించింది. అమ్మడి గ్లామర్ మెరుపులు కూడా బాగనే ఉన్నాయి. రేపు విజయవాడలో ఓ మొబైల్ షోరూం ఓపెనింగ్ కు కూడా అటెండ్ అవుతోందట లావణ్య త్రిపాఠి.
ఇలా వరుసగా !షాపు ఓపెనింగ్ ఆఫర్లు తప్పించి చేతిలో సినిమాలు లేకపోవడమే శోచనీయం. అయితే.. ఈ మధ్య లావణ్య తన ఫిజిక్ ను మార్చుకునే పనిలో పడిందట. ఛేంజ్ ఈజ్ గుడ్ అన్న కాన్సెప్టుతో కొత్తగా కనిపించాలని.. గ్లామర్ డోస్ విషయంలో కాసింత పట్టు సడలించాలని భావిస్తోందట ఈ భామ. మరి ఇవయినా కొత్త అవకాశాలను తెచ్చిపెడతాయేమో చూద్దాం.