కరోనా వేళ గర్భిణి డెలివరీకి లారెన్స్ సాయం

Update: 2020-05-02 13:30 GMT
ప్రస్తుతం లాక్ డౌన్ తో అంతా స్తబ్దుగా మారింది. ఈ సంక్షోభంలో ప్రజలకు సహాయం చేయడానికి ఎంతో మంది స్టార్లు ముందుకు వస్తున్నారు.ఇక స్టార్ డైరెక్టర్ కం నటుడు డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ సైతం ఎంతో సేవ చేస్తున్నారు. వివిధ స్వచ్ఛంద కార్యకలాపాలను ప్రకటించినప్పుడు రాఘవ లారెన్స్ తన పెద్ద హృదయాన్ని చూపించాడు.

కరోనా ఉన్నా లేకున్నా పేదవారికి సహాయం చేయడానికి రాఘవ లారెన్స్ ఎల్లప్పుడూ ముందుంటాడు. తాజాగా అతడి గొప్ప మనసు మరోసారి రుజువైంది. ఓ వ్యక్తి నుంచి లారెన్స్ కు ఆదుకోవాలని ఫోన్ వచ్చింది. తన భార్యకు కరోనా టైంలో డెలివరీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. ఆస్పత్రులు తెరిచి లేవని.. ఆమె గర్భిణీ స్త్రీని ప్రసవించడంలో సాయం చేయాలని కోరగా.. లారెన్స్ సహాయం చేశాడు.

వెంటనే లారెన్స్ తమిళనాడు ఆరోగ్య మంత్రి పీఏకి సమాచారం ఇచ్చాడు, అతను గర్భిణీ స్త్రీని కేఎంసీ ఆసుపత్రిలో చేర్పించడానికి సహాయం చేశాడు. పిల్లల సురక్షిత డెలివరీ తరువాత, లారెన్స్ తన ఫేస్బుక్ లో డెలివరీకి సహాయం చేసిన వైద్యులందరికీ కృతజ్ఞతలు తెలుపారు. తల్లి మరియు బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. చిన్నారి ఆరోగ్యంగా ఉందని, తల్లి చికిత్సలో ఉందని చెప్పాడు. దీంతో సోషల్ మీడియాలో లారెన్స్ ను “సేవలో దేవుడు” అంటూ కొనియాడు. ప్రస్తుత సంక్షోభ సమయంలో సహాయం అవసరమైన వ్యక్తులకు సహాయం చేయడానికి ముందుకు రావడానికి చాలా మందికి లారెన్స్ స్ఫూర్తిని ఇస్తున్నారు.
Tags:    

Similar News