`ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` ఏపీలో పైరసీ రెడీ!

Update: 2019-03-29 07:01 GMT
ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ ఏం చేసినా అందులో ప్ర‌త్యేక‌త ఉంటుంది. వివాదాస్ప‌ద కాన్సెప్టును ఎంచుకుని రెచ్చ‌గొట్టి ఉచిత‌ ప్ర‌చారం తెచ్చుకుని, అవ‌స‌రానికి మీడియాని వాడుకుని ఆర్జీవీ ఆడే వింతాట‌కం ప్ర‌పంచంలో ఇంకెవ‌రూ ఆడ‌రేమో!! అత‌డు ఏం చేసినా చెల్లింది. ఐస్ క్రీమ్ తీసి బ్రిటానియా బిస్కెట్ వేసినా అత‌డి చుట్టూనే ఇత‌ర ప్ర‌పంచం తిరిగింది. ఆయ‌న ప్ర‌తి క‌ద‌లిక‌ను లైవ్ రిపోర్టింగ్ చేసి మీడియా ఎంత‌గానో త‌రించింది. ఇప్పుడు ఎన్టీఆర్ అస‌లు క‌థ ఇదీ! అంటూ పెద్దాయ‌న నిజ జీవితాన్ని వాస్త‌వ కోణంలో తెర‌పైకి తెస్తే ప్ర‌చారం చేయ‌కుండా ఉంటారా? గ‌త కొంత‌కాలంగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ గురించి త‌ప్ప వేరే ఏ సినిమా గురించి అంత‌గా మాట్లాడుకోలేదు. ఓ ర‌కంగా బాహుబ‌లి స‌మ‌యంలో బాహుబ‌లి గురించి కూడా అంత‌గా మాట్లాడుకుని ఉండ‌రు.

ఎట్ట‌కేల‌కు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రిలీజైంది. అయితే ఏపీలో ఎల‌క్ష‌న్ కోడ్ పేరుతో తేదేపా అడ్డు పుల్ల వేయ‌డంతో రిలీజ్ కాని సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా నైజాం, ఓవ‌ర్సీస్ లో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. హైద‌రాబాద్ లో మెజారిటీ థియేట‌ర్ల‌లో ఈ సినిమా రిలీజై వేడి పెంచింది. ఇక‌పోతే అంతే వేగంగా ఈ సినిమా పైర‌సీ కూడా బ‌య‌ట‌ప‌డ‌నుంద‌ని తెలుస్తోంది. ఓవ‌ర్సీస్ నుంచే పైరేటెడ్ లింక్ లు ఆన్ లైన్ లో అప్ లోడ్ అయిపోతున్నాయి. ఇక‌పోతే హైద‌రాబాద్ స‌హా అన్నిచోట్లా బీటెక్ చ‌దివే బాబులంతా చ‌క‌చ‌కా పైర‌సీలో సినిమాలు చూసేయ‌డం రివాజు అయిపోయింది. వీళ్ల‌వ‌ల్ల‌నే పైర‌సీ జోరుగానూ వైర‌ల్ అయిపోతోంది.

తేదేపా వాళ్లు, కోర్టులు ఈ సినిమా సిల్వ‌ర్ స్క్రీన్ రిలీజ్ ని ఆప‌గ‌లగ‌డం ఓకే. యూట్యూబ్, సోష‌ల్ మీడియాలోనూ రాకుండా కోడ్ ఉప‌యోగించి నిలువ‌రించ‌గ‌లిగారు. అయితే ఆన్ లైన్ పైర‌సీని వీళ్లంతా ఆప‌గ‌ల‌రా?  పైర‌సీలోనే ఏపీ జ‌నం మొత్తం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని చూడ‌డం ఖాయం అన్న చ‌ర్చ సాగుతోంది. ఇక ఏపీ వ‌ర‌కూ నిర్మాత‌ల‌కు ఆ మేర‌కు క‌లెక్ష‌న్ల ప‌రంగా జేబుకు చిల్లు ప‌డ‌నుంది. అయితే ఇలాంటి ముప్పు త‌లెత్త‌కుండా పైరేట్ (పైర‌సీకారులు) ల‌కు ముకుతాడు వేయ‌గ‌ల‌రా?  లేదా? అన్న‌ది వేచి చూడాలి.

    

Tags:    

Similar News