అయినా ఏ క‌మెడియ‌న్ బతికి ఉన్నారు

Update: 2015-11-06 06:17 GMT
పోయిన‌వాళ్లు పోయారు అని తెలుసుకోలేక‌పోవ‌డం దుర‌దృష్ట‌కరం.. పోయినోళ్లు ఉన్నోళ్ల‌కు తీపి గురుతులు.. అని స‌రిపెట్టుకోవ‌డానికి లేదిప్పుడు. పోయినోళ్లు ఇంకొన్నాళ్లయినా జీవించి ఉంటే ఎంతో బావుండేదో!! ఇలా అనిపిస్తే ఆ పోయినోళ్ల మీద మ‌న‌కు ఎంత ప్రేమ ఉందో అర్థ‌మ‌వుతుంది. స‌రిగ్గా ఇలాంటి ఎక్స్‌ ప్రెష‌నే ఇచ్చారు సీనియ‌ర్ క‌మెడియ‌న్ ఎల్‌.బి.శ్రీ‌రామ్.

త‌న స్నేహితుడు - కోస్టార్ - క‌మెడియ‌న్ కొండ‌వ‌ల‌స ల‌క్ష్మ‌ణ‌రావు మ‌ర‌ణాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోయారు అన్న‌ది ఆయ‌న మాటల్లోనే అర్థ‌మ‌వుతోంది. ఇద్దరూ క‌లిసి ఎన్నో సినిమాల్లో న‌టించారు. అందుకే ఆయ‌న డీప్‌ గా డిప్రెష‌న్‌ లోకి వెళ్లారు. కొండ‌వ‌ల‌స ఇంకొన్నాళ్లు బ‌తికి ఉంటే ఎంతో బావుండేది. మ‌రెంతో వినోదాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించేవాడు. అయినా ఏ సీనియ‌ర్ క‌మెడియ‌న్ బ‌తికి ఉన్నారు. అంద‌రూ ప‌ర‌లోకాల‌కు వెళ్లిపోతున్నారు. వ‌య‌సు వ‌చ్చాక ఎవ‌రైనా వెళ్లాల్సిందే. అయినా ఎవ‌రు బ‌తికి ఉంటారు? ఎవ‌రు పోతారు? అన్న‌ది ఎవ‌రు చెప్ప‌గ‌ల‌రు? అంటూ త‌న‌లోని విచారాన్ని వ్య‌క్తం చేశారు. అయితే విచారించ‌ద‌గ్గ విష‌యం ఏమంటే .. అస‌లు ఎవ‌రు ఉన్నారు? ఎవ‌రు పోయారు? అన్న‌ది కామ‌న్ జ‌నాల‌కు తెలియ‌క‌పోవ‌డ‌మే.

అందుకే పోయిన‌వాళ్ల‌ను గుర్తు తెచ్చుకునేందుకు టాలీవుడ్ ఏదైనా ఓ గొప్ప కార్య‌క్ర‌మాన్ని త‌ల‌పెడితే బావుండేది.. అంటూ త‌న మ‌న‌సులోని మాట చెప్పారు. నిజ‌మే ఏవీఎస్‌ - ఆహుతి ప్ర‌సాద్ నుంచి మొన్న‌టికి మొన్న ఎమ్మెస్ నారాయ‌ణ‌ - ధ‌ర్మ‌వ‌ర‌పు వ‌ర‌కూ ఎవ‌రు ఉన్నారు? ఎవ‌రు పోయారు? అన్న‌ది కొంద‌రికి ఇప్ప‌టికీ క‌న్ఫ్యూజ‌నే. అందుకే ఎల్బీ చెప్పిన‌ట్టు ఏదైనా కార్య‌క్ర‌మాన్ని టాలీవుడ్ పెద్ద‌లు త‌ల‌పెడితే బావుండేది.
Tags:    

Similar News