ఒక్కోసారి ఆర్టిస్టులకు నిర్మాతలకు మధ్య.. దర్శకుడు నిర్మాత మధ్య కూడా వివాదాలు తలెత్తుతుంటాయి. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోకపోతే అది చినికి చినికి గాలివానగా మారతాయి. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు కం నటుడు గౌతమ్ మీనన్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ ఘర్షణ తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏమైంది? అన్న వివరాల్లోకి వెళితే..
ఇటీవలే అన్బు సెల్వన్ అనే తమిళ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఓ కీలక పాత్రను పోషించారు. హీరో విష్ణు విశాల్ - దర్శకుడు పా.రంజిత్ ఈ సినిమా పోస్టర్ ను సోషల్ మీడియాల ద్వారా విడుదల చేయగా వైరల్ అయ్యింది. అయితే ఈ పోస్టర్లు చూశాక..అసలు తనకు ఈ చిత్రం గురించి ఎంత మాత్రం తెలియదని గౌతమ్ మీనన్ పేర్కొన్నారు. నేను నటించిన సినిమానా.. ఇది నిజంగా షాకింగ్ న్యూస్. ఈ పోస్టర్ లో పేరు ఉన్న దర్శకుడిని నాకు తెలియదు.. అతడిని మునుపెన్నడూ కలవలేదు. దీన్ని ప్రముఖులతో ట్వీట్ చేయించారు. ఇలాంటివి చాలా తేలికగా చేయడం షాకింగ్..భయానకం`` అని ట్వీట్ చేశారు.
దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ఎంఎం స్టూడియోస్ తన యూట్యూబ్ ఛానెల్ లో కౌంటర్ వీడియోను విడుదల చేసింది. రెండు నిమిషాల నిడివితో వీడియో క్లిప్ ను విడుదల చేసింది. క్లిప్ లో వివేక్.. ప్రసన్నతో పాటు గౌతమ్ నటించిన సీరియస్ సన్నివేశం ఉంది. అనంతరం నిర్మాతలు గౌతమ్ మీనన్ ప్రకటనలను తప్పు పట్టారు. అతను నిజంగా అన్బు సెల్వన్ లో భాగమని నిరూపణ అయ్యింది. అయితే ఈ వీడియో క్లిప్ పై గౌతమ్ మీనన్ స్పందించాల్సి ఉంది.
గౌతమ్ మీనన్ ఇటీవల ట్రాన్స్ అనే చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అడపాదడపా తనకు నచ్చిన వాటిలో నటించేందుకు వెనకాడడం లేదు. ప్రస్తుతం శింబు ప్రధాన పాత్రలో ఓ సినిమాకి గౌతమ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబందించిన మరింత సమాచారం రావాల్సి ఉంది.