మహా అయితే.. మరో మూడు రోజులే మిగిలింది. వెండితెర అద్భుతంగా కీర్తిస్తున్న బాహుబలిని చూసే అవకాశం దగ్గరకు వచ్చేస్తోంది. నెలల తరబడి మనసును వెంటాడుతున్న సందేహాల్ని నివృతి చేసుకునే టైం దగ్గర పడినట్లే. నెలల తరబడి గుట్టుగా దాచుకున్న రహస్యం ఇప్పుడు బయటకు పొక్కిందా? అంటే అవుననే మాటనుకొందరు చెబుతున్నారు.
నిజం సంగతి ఎలా ఉన్నా.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడంటే అన్న ప్రశ్నకు సమాధానం దొరికేసినట్లేనన్న మాట వినిపిస్తోంది. కీలకమైన ప్రశ్నకు సమాధానం దొరికేసిందని.. అసలు విషయం లీక్ అయ్యిందంటూ.. ఆన్ లైన్లో ప్రచారం సాగుతోంది. తాజాగా వినిపిస్తున్న లీక్ బజ్ చూస్తే.. బాహుబలిని కట్టప్ప చంపటానికి కారణం శివగామి గా చెబుతున్నారు.
ఎందుకలా? అన్న ప్రశ్నకు చెబుతున్న సమాధానం ఏమిటంటే.. బాహుబలికి వ్యతిరేకంగా శివగామికి భల్లాలదేవ.. అతని తండ్రి బిజ్జల దేవుడు అసత్యాలు చెబుతారట. వాటిని నమ్మి శివగామి బాహుబలిని చంపేయమని చెబుతుందట. అయితే.. ఈ వాదనలో నిజం లేదన్న మాట వినిపిస్తోంది. మొదటి పార్ట్‌లోనే.. తన కొడుకు.. బాహుబలి మధ్య తేడాను.. వారి బుద్దిని గుర్తించటంలో శివగామి స్పష్టంగా ఉన్నట్లుగా చూపించిన నేపథ్యంలో.. ఇది నిజం కాదన్న వాదనను వినిపిస్తున్నారు. అయినా.. ఇన్నాళ్లు ఆగాం.. మరో మూడు రోజుల్లో అసలు విషయం బయటకు రానుంది కాబట్టి.. ఆ విషయాన్ని అధికారికంగా తెలుసుకునేందుకు వెయిట్ చేస్తే బాగుంటుందేమో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/