మూడు దశాబ్దాల తర్వాత ప్రేక్షకుల ముందుకు లెజండరీ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్..!
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం భారీ తారాగణంతో తెరకెక్కించిన లేటెస్ట్ పీరియాడికల్ మూవీ "పొన్నియన్ సెల్వన్". ఇది దిగ్గజ దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్ట్ గా పేర్కొనబడింది. చోళుల కాలం నాటి కథాంశంతో ప్రసిద్ధ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన 'పొన్నియిన్ సెల్వన్' నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
'పొన్నియన్ సెల్వన్' చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించారు. ఫస్ట్ పార్ట్ ని "PS 1" పేరుతో రిలీజ్ కు రెడీ చేశారు. ఇందులో విక్రమ్ - కార్తీ - జయం రవి - విక్రమ్ ప్రభు - ఐశ్వర్యారాయ్ - త్రిష - శోభితా ధూళిపాళ్ల - ఐశ్వర్య లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
చోళుల కథాంశం మీద సినిమా చేయాలని మణిరత్నం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు కోలీవుడ్ స్టార్ విజయ్ లతో తీయలనుకున్నారు కానీ.. ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. నిజానికి మూడు దశాబ్దాల ముందే 'పొన్నియన్ సెల్వన్' మూవీ చేయాలని మణిరత్నం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో మణిరత్నం దర్శకత్వంలో 1989లోనే 'పొన్నియన్ సెల్వన్' మూవీ చేయాలని అనుకున్నట్లు తెలుస్తోంది. 'కల్కి' మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఇందులో ప్రభు - సత్యరాజ్ ఇతర ప్రధాన పాత్రదారులని.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా.. ఇళయరాజాను సంగీత దర్శకుడిగా అనుకున్నామని తెలిపారు.
అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్ కు రూ. 2 కోట్ల వరకూ బబడ్జెట్ అవుతుందని అంచనా వేశారట. కానీ ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. అయితే ఎస్ఎస్ రాజమౌళి 'బాహుబలి' సినిమాని రెండు భాగాలుగా తీసి పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం అందుకున్న తర్వాత, మణిరత్నం భారీ బడ్జెట్ తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను చేయాలని గట్టిగా సంకల్పించారని తెలుస్తోంది.
లైకా ప్రొడక్షన్స్ మరియు మణిరత్నం మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సుభాస్కరన్ - మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' చిత్రాన్ని రెండేళ్ల క్రితం పట్టాలెక్కించారు. పాండమిక్ టైంలో అనేక వ్యయప్రయాసలతో సినిమాని పూర్తి చేశారు. సెప్టెంబర్ 30న పాన్ ఇండియా స్థాయిలో 'PS 1' రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలో మంగళవారం గ్రాండ్ గా ఆడియో & ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి కమల్ హాసన్ తో పాటుగా సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సినిమాపై మణిరత్నం భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుతుందో చూడాలి.
ఇకపోతే PS చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.