ఓజోన్ పొరకు చిల్లు పడిపోయింది. కొన్నేళ్ల తర్వాత మనమంతా సూర్య తాపానికి మాడి మసైపోతాం.. అని ఇప్పటికే ప్రచారమవుతోంది. మడిషన్నవాడికి ఒక్కసారే చెబుతారు. ఎన్నిసార్లు చెప్పినా విననివాడిని మనిషి అని ఎలా అనగలం? అయినా ఏదోలా బతికేస్తున్నాం. ఇక పచ్చదనం అన్నది భూమ్మీదే లేకుండా పోతే - నీళ్లు లేక పంటల్లేక - ఆకలితో మలమల లాడే పరిస్థితి దాపురిస్తే .. అందుకు పూర్తిగా బాధ్యులెవరు? ఎవరికి వారే!
అందుకే భవిష్యత్ లో రానున్న ముప్పును ఆపేందుకు తమవంతుగా కొందరు సెలబ్రిటీలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. సెలబ్రిటీ స్టాటస్ ఉన్నది కేవలం ఎంజాయ్ చేసేందుకే కాదు, కాస్త సామాజిక బాధ్యతతో ప్రవర్తించేందుకు కూడా అని నిరూపిస్తున్నాడు హాలీవుడ్ స్టార్ హీరో డికా ప్రియో! వరల్డ్ సెన్సేషనల్ హిట్ సినిమా టైటానిక్ లో క్యూట్ బోయ్ గా - లవర్ బోయ్ గా ఆకట్టుకున్న డికాప్రియో డిపార్టెడ్ - ఇన్ సెప్షన్ లాంటి సినిమాలతో తెలుగు జనాల్లోనూ ఓ హాట్ టాపిక్ అయ్యాడు. అతడెవరో మన వాళ్లకి తెలుసు. డికా ప్రియో సినిమాలకే కాదు పర్యావరణానికి కూడా ప్రియుడే. వాతావరణ కాలుష్య నివారణ కోసం ప్రపంచవ్యాప్తంగా విజిట్స్ చేస్తూ తనవంతుగా కొంత ఆపేందుకు ప్రయత్నిస్తున్నాడు.అందులో భాగంగానే ఇండియా వచ్చి హర్యానాలోని ఓ ప్రాంతాన్ని సందర్శించాడు.
పవర్ ప్లాంట్ ల వల్ల ఉత్పన్నమయ్యే కాలుష్య కాసారంపై డాక్యుమెంట్ తయారు చేసుకుంటున్నాడు. ఆల్టర్ నేట్ పవర్ ఉత్పత్తులపై అవగాహన కల్పించే పనిలో పడ్డాడు. కాలుష్యం వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆరా తీస్తున్నాడు. బావుంది కదూ.. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం మన ప్రభుత్వాలకు, మన ప్రజలకు ఉంటే బావుండేది అని చెప్పకనే చెబుతున్నట్టు లేదూ?