దాదాపు దశాబ్దం పాటు టాలీవుడ్లో నెంబర్ వన్ సంగీత దర్శకుడిగా కొనసాగాడు మణిశర్మ. తొంభైల చివర్లో మొదలైన ఆయన హవా దశాబ్దం పాటు నిరాటంకంగా సాగింది. అప్పట్లో అగ్రతారలైన చిరంజీవి.. నాగార్జున.. బాలకృష్ణ.. వెంకటేష్ వీళ్ల తొలి ప్రయారిటీ మణిశర్మే. ఆ తర్వాతి తరం స్టార్లయిన పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు కూడా మణికి మంచి ప్రయారిటీ ఇచ్చేవాళ్లు. స్టార్ డైరెక్టర్ల ఫస్ట్ ఛాయిస్ కూడా మణిశర్మే అయ్యేవాడు. కానీ దేవిశ్రీ ప్రసాద్.. ఆర్పీ పట్నాయక్.. తమన్.. అనూప్.. ఇలాంటి నవతరం సంగీత దర్శకులు వచ్చాక మణి వెనుకబడిపోయాడు. ఆయనకు అవకాశాలు తగ్గాయి. ఆయన సంగీతంలోనూ క్వాలిటీ తగ్గింది.
ఐతే మణిశర్మ మనసు పెట్టి చేయాలే కానీ.. ఇప్పటికీ ఆయన సంగీతానికి తిరుగుండదనడానికి రుజువుగా నిలిచింది గత ఏడాది వచ్చిన ‘జెంటిల్ మన్’. ఈ చిత్రానికి తన పాటలు.. నేపథ్య సంగీతంతో పెద్ద బలంగా నిలిచాడు మణి. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ మణి తనదైన ముద్ర చూపించే ప్రయత్నం చేస్తున్నట్లున్నాడు ‘లై’ సినిమాలో. నితిన్-హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఈ రోజే రిలీజైంది. ఆ టీజర్లో బ్యాగ్రౌండ్ స్కోర్ వింటే చాలా మంచి ఫీలింగ్ కలుగుతోంది. చాలా ట్రెండీగా.. స్టైలిష్ గా అనిపించే ఆర్.ఆర్ ఇచ్చాడు మణి ఈ మోషన్ పోస్టర్ కు. హను మ్యూజిక్ విషయంలో మంచి టేస్టున్న డైరెక్టర్. అందాల రాక్షసి.. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాల్ని పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంది. ‘లై’ సినిమాకు మణి నుంచి మంచి ఔట్ పుట్ రాబట్టుకునే ఉంటాడని భావిస్తున్నారు. మరి మణి ఈసారి కూడా ‘జెంటిల్ మన్’ తరహాలో అదరగొట్టాడంటే మళ్లీ ఆయన పెద్ద సినిమాలతో బిజీ అయ్యేందుకు అవకాశముంటుంది.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/