లైగర్: అసలు ఏ ఏరియాలో ఎంత నష్టపోయింది?

Update: 2022-10-27 02:36 GMT
విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయిక లో వచ్చిన పాన్ ఇండియా మూవీ లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా బిగ్ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అనే నమ్మకంతోనే ఎగ్జిబిటర్స్ భారీ స్థాయిలో విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో భారీ స్థాయిలో కొనుగోలు చేసిన వారు తీవ్ర స్థాయిలో నష్టపోవాల్సి వచ్చింది. ఫైనల్ గా ఇప్పుడు ఎగ్జిబిటర్స్ అందరూ కూడా కొంతైనా నష్టాలను తగ్గించేలా చూడాలి అని కోరుకుంటున్నారు.

అంతేకాకుండా ఒప్పుకున్న డబ్బును వెనక్కి తిరిగి ఇవ్వకపోతే ధర్నా చేస్తాము అని కూడా హెచ్చరికలు చేశారు. దీంతో పూరి జగన్నాథ్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అసలు ఒకసారి బిజినెస్ క్లోజ్ చేసిన తర్వాత డబ్బు వెనక్కి తిరిగా ఇవ్వాల్సిన అవసరమైతే లేదు. కానీ నష్టం వచ్చింది కాబట్టి దయతోనే అందరూ బాగుండాలి అని కారణంగా కొంత డబ్బులు వెనక్కి ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు చెప్పిన పూరి ఇప్పుడు ధర్నా చేస్తారు అంటే ఇవ్వాలి అనుకున్న డబ్బు కూడా ఇవ్వరు అని తెగేసి చెప్పారు.

నిజానికి పూరి జగన్నాథ్ ఒక రూపాయి కూడా ఎవరికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎగ్జిబిటర్స్ అందరూ కూడా సినిమాను కొనుగోలు చేశారు కాబట్టి నష్టం వచ్చిన లాభం వచ్చిన పూర్తిగా వాళ్లకే చెందుతుంది. అయితే లైగర్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో నష్టాలు కలుగజేసింది అనే వివరాల్లోకి వెళితే.

నైజాంలో ఈ సినిమా దాదాపు 19 కోట్లు వరకు నష్టపోగా సిడేట్లో 7.25 కోట్లు, ఉత్తరాంధ్రలో 6.5 కోట్లు, ఇక ఈస్ట్ లో 4.20 కోట్లు గుంటూరు వెస్ట్ లో 3.20 కోట్లు, గుంటూరు 3.80 కోట్లు వరకు నష్టపోయింది. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకుంటే లైగర్ సినిమా 62 కోట్ల వరకు బిజినెస్ చేయగా దాదాపు 49 కోట్ల వరకు నష్టాలను కలుగజేసింది.

కర్ణాటక మిగతా రాష్ట్రాలలో కూడా భారీగా నష్టాలు తప్పలేదు. ఇక ఓవర్సీస్ లో కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. కేవలం హిందీలో మాత్రమే ఈ సినిమా కోటి నష్టంతో బయటపడింది. అక్కడ సినిమాను 10 కోట్లకు అమ్మారు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే లైగర్ సినిమా దాదాపు 60 కోట్ల వరకు నష్టాలు కలుగజేసినట్లు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News