గత కొంతకాలంగా తీరిక లేని షెడ్యూళ్లతో విజయ్ దేవరకొండ అలసిసొలసి పోయాడట. ఎట్టకేలకు షెడ్యూల్ పూర్తి చేసి దసరా సెలవు తీసుకున్నాడు. హీరో విజయ్ దేవరకొండ గోవాలో లైగర్ కీలక క్లైమాక్స్ షెడ్యూల్ ను ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చాడు. స్వల్ప విరామం తర్వాత మూవీ యూనిట్ మరో ముఖ్యమైన షెడ్యూల్ కోసం యుఎస్ కు వెళ్తుంది. ఇందులో విజయ్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో స్క్రీన్ ను పంచుకుంటాడు.
విజయ్ హైదరాబాద్ కు తిరిగి వచ్చిన తర్వాత ట్విట్టర్ లో తన కష్టాన్ని చెప్పుకొచ్చాడు. ఇంట్లో రిలాక్స్ డ్ గా ఉన్న ఓ ఫోటోని ట్వీట్ చేసిన దేవరకొండ అలసట గురించి ఓపెనయ్యాడు. గోవా షెడ్యూల్ ఇప్పటివరకు తన జీవితంలో అత్యంత శారీరకంగా మానసికంగా అలసిపోయిన షెడ్యూల్ గా వర్ణించాడు. అది అత్యంత ముఖ్యవైన షెడ్యూల్ అని కూడా చెప్పాడు. ఇంటికి తిరిగి రావడం కోసం ఎంతో వేచి చూసిన వీడీ .. ఇక్కడ చాలా సంగతులతో బిజీ అయిపోయాడట. కానీ ఈ రాత్రికి ధన్యవాదాలు చెప్పాలని.. కొంత ప్రేమను తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను`` అని హృదయపూర్వకంగా ట్వీట్ చేశాడు.
టైసన్ తో షెడ్యూల్ చాలా కీలకం
లైగర్ పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ చిత్రం రక్తి కట్టించే స్క్రీన్ ప్లేతో తెరకెక్కుతోంది. ఆసక్తికరంగా ఇందులో మైకేల్ జాక్సన్ ఓ కీలక పాత్రను పోషిస్తుండడం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. మాజీ బాక్సింగ్ దిగ్గజం టైసన్ పిడిగుద్దులు అంటే తనకు చాలా భయం అని దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. బాక్సింగ్ ఐకాన్ భారతీయ చిత్రంలో నటించడం ఇదే మొదటిసారి అనుకుంటే అది కూడా దేవరకొండ సినిమాలో కనిపిస్తుండడం మరో సర్ ప్రైజ్ అనే చెప్పాలి. మైక్ టైసన్ కి చెడ్డవాడు అన్న పేరు ఉన్నా కానీ.. అతడు ఇటీవల మారిన మనిషిగా కనిపించారని విజయ్ దేవరకొండ అన్నారు. నాకు బాక్సింగ్ కూడా తెలియకముందే నాకు మైక్ తెలుసు. అతను ఇప్పుడు మారిన వ్యక్తి. ఆయన చెప్పిన కొన్ని విషయాలు నన్ను నిజంగా చాలా బాధించాయి... అని తెలిపారు.
అతడి పంచ్ లు ఏవీ తనకు కనెక్టవ్వకుండా చాలా జాగ్రత్తపడతాను అని తెలిపారు. మైక్ టైసన్ తన అత్యున్నత దశలో ఉన్నప్పుడు అత్యంత భయంకరమైన .. దారుణమైన శక్తివంతమైన బాక్సర్ లలో ఒకడు. అతని పంచ్ తగిలిందంటే అంతే సంగతి. మైక్ టైసన్ తో ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించేటప్పుడు విజయ్ కూడా దెబ్బలు తినేస్తానని భయపడ్డాడట. ఈ చిత్రంలో అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్ స్టార్లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఛార్మి- పూరితో కలిసి కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీలో అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు కరణ్ సన్నాహకాల్లో ఉన్నారు. ఇది వీడీ కెరీర్ బెస్ట్ మూవీగా నిలుస్తుందని అనన్య పాండే తండ్రి చుంకీ పాండే.. రామో గోపాల్ వర్మ వంటి ప్రముఖులు ప్రశంసలు కురిపించిన సంగతి విధితమే.