అననివాడిని తిట్టాల్సొచ్చేది.. రాజకీయాలపై చిరు
మెగాస్టార్ చిరంజీవి `ప్రజారాజ్యం` పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమా వినోద పరిశ్రమలకు పూర్తి భిన్నమైన రంగంలోకి ప్రవేశించిన ఆయన ఆరంభం చాలా ఎదురు దెబ్బల్ని ఎదుర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి `ప్రజారాజ్యం` పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమా వినోద పరిశ్రమలకు పూర్తి భిన్నమైన రంగంలోకి ప్రవేశించిన ఆయన ఆరంభం చాలా ఎదురు దెబ్బల్ని ఎదుర్కొన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులనుంచి విమర్శల్ని ఎదుర్కోవడమే కాదు, వారిని ఎదుర్కొనేందుకు ప్రతిదాడి చేయాల్సి వచ్చేది. నాటి హార్డ్ హిట్టింగ్ రాజకీయాలు తనకు చాలా నేర్పించాయని కూడా చిరు గుర్తు చేసుకున్నారు. ఒక్కోసారి అన్నవాడిని, అననివాడిని కూడా తిట్టాల్సొచ్చేదని తాజాగా `బ్రహ్మానందం` ప్రీరిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్లాక చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చిందని చిరంజీవి అన్నారు.
ప్రత్యర్థిని తిట్టేందుకు తిట్లు రాసుకునేవాడిని అని కూడా చిరంజీవి తెలిపారు. మీరు దేనికీ సరిగా నవ్వడం లేదని తన భార్య అన్నప్పుడు హాస్యగ్రంధులు దొ*శాయేమోనని అన్నట్టు గుర్తు చేసుకున్నారు. ఖైదీ నంబర్ 150 తర్వాత నవ్వడం తిరిగి మొదలు పెట్టానని చిరంజీవి అన్నారు. అనీల్ రావిపూడితో చేసే తదుపరి చిత్రంతో నా హాస్యగ్రంధులు తారాస్థాయిలో తెరుచుకుంటాయని ఆశిస్తున్నానని కూడా వ్యాఖ్యానించారు.
మెగాస్టార్ సున్నిత మనస్తత్వానికి రాజకీయాలు సరిపడవని అప్పట్లో పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. అక్కడ హార్డ్ హిట్టింగ్ మైండ్ సెట్స్ ఆయనకు ఎంతమాత్రం సరిపడలేదని కూడా విశ్లేషణలు వెలువడ్డాయి. రాజకీయ రంగం రావణాసుర దాష్ఠీకానికి చెందినది. పత్రికల్లో కథనం ప్రకారమే ఆయన రాజకీయాల నుంచి ఎగ్జిట్ కావాల్సి వచ్చింది. అయితే అన్నయ్యకు భిన్నంగా తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయ రంగాన్ని, ఇక్కడ మనుషుల్ని పూర్తిగా ఆకలింపు చేసుకుని ముందుకు సాగుతున్నారని కూడా ఇటీవల విశ్లేషణలు వెలువడుతున్నాయి.
మెగాస్టార్ ప్రస్తుతం `విశ్వంభర` అనే చిత్రంలో నటిస్తున్నారు. మల్లిడి వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతోంది. ఇందులోని హాస్య సన్నివేశాలు, అడ్వెంచర్ ఆకట్టుకుంటాయని టాక్ వినిపిస్తోంది.