టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి స్పీడ్ గురించి అతడి టేకింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి పావుగంటలోనే సినిమా కథలోకి మూడ్ ని ఎక్కిస్తాడు. ఆ తర్వాత గ్రాఫ్ నెమ్మదిగా టేకాఫ్ అవుతుంది. ఇంటర్వెల్ టైమ్ కి పీక్స్ కి చేర్చేస్తాడు. ఆ తర్వాత సెకండాఫ్ లో దానిని హోల్డ్ చేయడంలో అలాగే ప్రీక్లైమాక్స్ క్లైమాక్స్ టైమ్ కి ఎమోషన్ ని పీక్స్ చేర్చడం అనే ఫార్ములాని బాగా కాచి వడపోసిన కమర్షియల్ డైరెక్టర్ గా అతడి ట్రాక్ రికార్డు చెబుతుంది.
పోకిరి- బిజినెస్ మేన్- అమ్మా నాన్న తమిళమ్మాయి- ఇడియట్ ఇలా ఆయన కెరీర్ లో చాలా సినిమాలకు ఇదే పెద్ద ప్లస్ అయ్యింది. అయితే ఆ సినిమాలతో పోలిస్తే ఇప్పటి ట్రెండ్ వేరు. ఫార్ములా పాతదే అయినా ఎంచుకునే కథలు మారాయి. ఇప్పుడు లైగర్ ని యూనివర్శల్ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ఇటు తెలుగు ఆడియెన్ అటు తమిళం హిందీ ఆడియెన్ కి కనెక్టయ్యే కథాంశాన్ని పూరి ఎంపిక చేసుకుని తెరకెక్కిస్తున్నారు. ఈ టీమ్ కి తోడుగా కరణ్ జోహార్ చేరిన సంగతి తెలిసిందే.
లైగర్ ని తెలుగు-హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇటీవల దేవరకొండ- అనన్య పాండే జంటపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించిన పూరి..ముంబైలో కోవిడ్ పెరగడంతో హైదరాబాద్ కి వచ్చేశారు. ఇక్కడ అప్పుడే ఎడిటింగ్ ని కూడా పూర్తి చేస్తున్నారు.
ఇదిలా ఉండగానే లైగర్ గురించి మరో ఆసక్తికర చర్చ మొదలైంది. మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ పాత్రను మరో లెవల్లో చూపించనున్నారు పూరి. అందుకోసం దేవరకొండ తన లుక్ ని పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. అతడు ఇటీవల గిరజాల జుత్తు పెంచి మ్యాకో మ్యాన్ లా మారాడు. అయితే దీనివెనక అసలు కారణం వేరు. విజయ్ ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. అందుకే లుక్ పూర్తి భీకరంగా మార్చాడు. పతాక సన్నివేశాల్లో యాక్షన్ తో పాటు ఎమోషన్ ని పీక్స్ కి చేర్చేలా పూరి సీన్స్ రాసుకున్నారట. దేవరకొండ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం .. తొలి హిందీ చిత్రం కూడా కావడంతో దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని హార్డ్ వర్క్ చేస్తున్నాడు.