భారీ ధరకు 'లైగర్' డిజిటల్ హక్కులు..!

Update: 2022-02-07 18:04 GMT
డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ''లైగర్''. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలోని ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనేది ట్యాగ్ లైన్. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సంబంధించిన షూటింగ్ మొతం పూర్తైనట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. అయితే ఈ సినిమా మీదున్న క్రేజ్ దృష్ట్యా డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయినట్లు ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది..

గత కొంతకాలంగా టాలీవుడ్ స్టార్స్ నటించే సినిమాల నాన్-థియేట్రికల్ రైట్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. కేవలం వీటి ద్వారానే నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉంటూ.. మంచి లాభాలను వెనకేసుకుంటున్నారు. ఇప్పుడు ''లైగర్'' సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ హక్కులు భారీ రేటు పలికాయి. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో దాదాపు ₹ 60 కోట్లకు ఈ సినిమాకు సంబంధించిన అన్ని భారతీయ భాషల డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసిందని సమాచారం.

ఇదే కనుక నిజమైతే 'లైగర్' విజయ్ దేవరకొండ మరియు పూరీ జగన్నాధ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజిటల్ డీల్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకొని బజ్ క్రియేట్ చేసింది. ఇటీవల వచ్చిన టీజర్ మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఈ క్రమంలోనే రికార్డు స్థాయి ధరకు నాన్ థియేట్రికల్ హక్కులు అమ్ముడు పోయాయని తెలుస్తోంది.

''లైగర్'' సినిమా తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇందులో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ - రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రోనీత్ రాయ్ - ఆలీ - విషు రెడ్డి - మకరంద్ దేశ్ పాండే - గెటప్ శీను తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

ధర్మ ప్రొడక్షన్స్ - పూరి కనెక్ట్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాధ్ - ఛార్మి కౌర్ - కరణ్ జోహార్ - అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందించగా.. జానీ షేక్ బాషా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. 'లైగర్' చిత్రాన్ని 2022 ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Tags:    

Similar News