విజయ్ దేవరకొండ హీరో గా పూరి జగన్నాథ్ 'లైగర్' సినిమాను రూపొందించాడు. పూరి - ఛార్మితో పాటు ఈ సినిమాకి కరణ్ జొహార్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే నటించిన ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ఫ్యాన్ డమ్ టూర్ ను నిర్వహించింది.
ఈ సందర్భంలో 'వరంగల్'లో పూరి మాట్లాడుతూ .. " వర్షం పడుతున్నా ఇందాకటి నుంచి తడుస్తూ నిలబడ్డ మీ అందరికీ లవ్ యూ. ఒక రోజున మా ఆవిడ నన్ను తిట్టింది. "కొత్త కొత్త డైరెక్టర్లు వస్తున్నారు .. మంచి మంచి సినిమాలు చేస్తున్నారు .. నువ్వు మాత్రం వెనకబడిపోతున్నావు .. కాస్త పక్కవాళ్ల సినిమాలు కూడా చూడు" అని చెప్పింది.
ఏ సినిమా చూడాలో చెప్పు అంటే .. సందీప్ రెడ్డి అనే కుర్రాడు 'అర్జున్ రెడ్డి' అనే సినిమా తీశాడు .. విజయ్ దేవరకొండ అనే కుర్రాడు చేశాడు .. ఇప్పటికే ఆ సినిమాను మేము మూడుసార్లు చూశామని చెప్పింది. అప్పుడు నేను ఆ సినిమాను చూశాను .. చాలా బాగా నచ్చింది. ఆ సినిమాలో విజయ్ యాక్టింగ్ చూసిన తరువాత అతనితో సినిమా చేయాలని నేను ఆ రోజునే డిసైడ్ అయ్యాను. నాకు విజయ్ లో నచ్చింది అతని నిజాయితి .. బయటనే కాదు .. యాక్టింగ్ లోను ఆ నిజాయితి కనిపిస్తుంది. మాటల్లోను ఆ నిజాయితి వినిపిస్తుంది.
ఒక నిర్మాతగా నేను అతనికి రెండు కోట్లు పంపించాను. ఆ తరువాత మాకు ఏదో అప్పు ఉందని తెలిసి .. ముందు ఆ అప్పు తీర్చమని ఆ రెండు కోట్లు తిరిగి పంపించాడు. ఏవడండి ఈ రోజుల్లో అట్లా చేసేది .. అందుకు క్లాప్స్ కొట్టండి. సినిమా షూటింగుకు ముందు తనని ఒక కొడుకులా చూసుకోమని వాళ్ల నాన్న నాకు చెప్పాడు. కానీ విజయ్ నన్ను వాళ్ల డాడీలా చూసుకున్నాడు. నా కష్టాల్లో నాతో పాటు నుంచున్నాడు .. అందుకు అతనికి హ్యాట్సాఫ్. అతనిలాంటి హీరోను నేను ఇంతవరకూ చూడలేదు. మైక్ టైసన్ ను పట్టుకుని కెమెరా ముందుకు తీసుకుని రావడానికి మాకు ఒక ఏడాది పట్టింది. ఆయనతో కలిసి వర్క్ చేసినందుకు గర్వపడుతున్నాను.
అనన్య పాండే విషయానికి వస్తే తాను మంచి అందగత్తె మాత్రమే కాదు .. మంచి ఆ ఆర్టిస్ట్ కూడా. రమ్యకృష్ణ గారు రెబల్ తల్లిగా ఈ సినిమాలో కనిపిస్తారు. అలాంటి ఒక తల్లి ఉండాలని ఆడియన్స్ కి అనిపిస్తుంది.
చార్మీ విషయానికి వస్తే మగాళ్లకంటే ఎక్కువగా కష్టపడుతుంది. ఎలాంటి సమస్యలను కూడా నా వరకూ తీసుకుని రాదు. ఒక్కోసారి ఏడ్చేస్తుంది కూడా .. కానీ అది కూడా నాకు తెలియకుండా చూసుకుంటుంది. నాకు టెన్షన్ లేకుండా చూడటం కోసం తను టెన్షన్ పడుతుంది .. అందుకు తనకి థ్యాంక్స్ చెబుతున్నాను. అందరూ కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. అందువలన తప్పకుండా ఈ సినిమా హిట్ కొడుతుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.