మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మధ్య బాక్సాఫీస్ పోరు షురూ అయిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరి సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద నువ్వా? నేనా? అన్న రీతిలో తలపడటానికి రెడీ అవుతున్నాయి. వరుణ్ తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోన్న `గని` సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఉపేంద్ర- సునీల్ శెట్టి లాంటి దిగ్గజనటులు సైతం గని లో కీలక పాత్రలు పోషించడంతో అంచనాలు స్కైని టచ్ చేస్తున్నాయి. ఇది కేవలం తెలుగు ఆడియన్స ని టార్గెట్ చేసి తెరకెక్కించిన చిత్రమే అయినా పొరుగు మార్కెట్లలో వర్కవుటయ్యే కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. పైగా వరుణ్ వరుస సక్సెస్ లతో ఉన్న నేపథ్యంతో గనికి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.
ఇక విజయ్ హీరోగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ `లైగర్` ని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. పూరి స్క్రిప్ట్ పాన్ ఇండియా స్థాయిలో ఉంటుందా? అన్న దానికి రిలీజ్ అయితే గానీ క్లారిటీ రాదు. అయితే ప్రచారం మాత్రం ఆ స్థాయిలోనే జరుగుతోంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడంతో ఈ స్థాయిలో ప్రచారం జరుగుతుందన్నది కొంతమంది వాదన. అయితే ఈ రెండు సినిమాలు రిలీజ్ అయితే స్థానికంగా లైగర్- గనికి ఎలాంటి పోటీనిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
థియేటర్స్ పరంగా చూసుకుంటే `గని` సినిమాకి అధిక థియేటర్లు దొరికే ఛాన్స్ ఉంది. థియేటర్లు కేటాయించడం అన్నది అల్లు అరవింద్ చేతిలో పని కాబట్టి... ఆ రకంగా గనికి పెద్ద ప్లస్ గా కనిపిస్తోంది. అయితే ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లకు పూరి ప్రొడెక్ట్ అంటే విపరీతమైన నమ్మకం. పూరి బ్రాండ్ మీదనే ఎన్నోసార్లు ఆయన సినిమాలు మార్కెట్ అయ్యాయి. హీరో ఇమేజ్ తో పని లేకుండా పూరి బ్రాండ్ కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు బయ్యర్లు. ఆ రకంగా లైగర్ కు తెలుగులో ప్రధానంగా కలిసొచ్చే అంశమిది. మరి అంతిమంగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలంటే చివరిగా కంటెంట్ తో కొట్టాల్సిందే. లైగర్ పాన్ ఇండియా టార్గెట్ కాబట్టి ఇంకా ఎక్కువ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మరి గని వర్సెస్ లైగర్ వార్ లో ఏది పై చేయి సాధిస్తుందో చూడాలి.