ఆన్ సెట్స్ ఒక్కోసారి అనూహ్య సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని ప్రమాదాలు ప్రాణాంతకంగానూ ఉంటాయి. ఒక్కోసారి గాయాలతో బైటపడినా , కొన్నిసార్లు విధి రాతను తప్పించుకోవడం ఎవరి వల్లా కాదు. లొకేషన్ లో నిర్లక్ష్యం కొన్నిసార్లు ప్రాణాలు తీసిన ఘటనలున్నాయి. చిందరవందరగా పడి ఉండే కరెంటు వైర్లు - కేర్ లెస్ యాటిట్యూడ్ వల్ల హై ఎలక్ర్టిక్ షాక్ తిని సెట్ కార్మికులు మరణించిన సందర్భాలున్నాయి.
ఇదిగో నిన్నటిరోజున అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ సంఘీ టెంపుల్ లో జరిగింది. ఓ లైట్ అసిస్టెంట్ కరెంట్ షాక్ తిని అసువులు బాసాడు. అందని తీరాలకు వెళ్లిపోయాడు. శ్రీకాకుళానికి చెందిన అతడి పేరు పత్తికాయల తిరుపతిరావ్. శేరి లింగంపల్లిలో నివాసం ఉంటాడాయన. సంఘీ టెంపుల్ లో షూటింగ్ కోసం వచ్చి ప్రమాదానికి గురై మరణించాడు. నాని హీరోగా ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్ లో ఇన్సిడెంట్ జరిగింది. నాని నిన్నటిరోజున షూట్ లో పాల్గొన్నాడా..? లేదా? అన్నది తెలియదు కానీ.. సంఘీ టెంపుల్ లో ఎలాంటి అనుమతి లేకుండా అనధికారికంగా షూటింగ్ చేస్తున్నారని తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం ప్రస్తుతం చిత్రనిర్మాతలపై కేసు నమోదైంది. సస్పెక్టెడ్ మరణం కింద కేసు బుక్ అయ్యింది. సిటీ కమిషనర్ అనుమతి లేకుండా షూటింగ్ చేస్తున్నందుకు మరో సెక్షన్ కింద కేసు ఫైల్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు సాగుతోంది.
ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడైనా .. ఇండస్ర్టీ మరింత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఆన్ సెట్స్ ప్రత్యేకమైన రూల్స్ ని పెట్టుకుని పనిచేసేలా వర్కర్స్ ని ప్రేరేపించాల్సి ఉంటుంది. ప్రమాదాలు నివారణకు చర్యలు చేపట్టాలి.