డైరెక్టర్ ఎవరైనా బాలయ్యకు సింహం డైలాగ్‌ కామన్‌

Update: 2022-01-02 02:30 GMT
నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ వంద కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకుని బాలయ్య కెరీర్‌ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక వీరిద్దరి కాంబోలో అఖండ హ్యాట్రిక్ సినిమా గా నిలిచింది. సింహా.. లెజెండ్‌.. ఇప్పుడు అఖండ. ఈ మూడు సినిమాల్లో కూడా బాలయ్య ను అభిమానులు ఎలా చూడాలని ఆశ పడుతున్నారు.. ఎలా ఉంటే అభిమానులు థ్రిల్‌ ఫీల్‌ అవుతారో అలాగే బోయపాటి చూపించాడు. కనుక మూడు సినిమాలకు మూడు కూడా మంచి విజయాలను దక్కించుకున్నాయి. అందుకే ఇప్పుడు బాలయ్య తో తదుపరి సినిమాలు చేయాలనుకున్న వారు బోయపాటి ఫార్ములా ఫాలో అయితే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. అభిమానులు అనుకున్నట్లుగానే దర్శకుడు గోపీచంద్‌ మలినేని కూడా మాస్.. మసాలా.. యాక్షన్ ఫార్ములాను అనుసరించబోతున్నట్లుగా తాజాగా అన్‌ స్టాపబుల్ షో లో చెప్పుకొచ్చాడు.

రవితేజ తో కలిసి అన్‌ స్టాపబుల్‌ షో లో బాలయ్యతో సందడి చేసిన దర్శకుడు గోపీచంద్‌ మలినేని ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా గురించి పలు విషయాలను వెళ్లడించాడు. బాలయ్య తో గోపీచంద్‌ మలినేని తెరకెక్కిస్తున్న సినిమా యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతుంది. ఈ సినిమా లో ఒక డైలాగ్ ను గోపీచంద్‌ మలినేని రివీల్‌ చేశాడు. రేయ్‌ రోడ్డు మీద జింక వచ్చిందనుకో ఎవడైనా హారన్‌ కొడతాడు.. అదే సింహం రోడ్డు మీదకు వచ్చిందంటే ఇంజన్ ఆపి సైలెంగ్ గా కూర్చోవాల్సిందే.. అక్కడున్నది సింహం రారేయ్‌ అంటూ బాలయ్య తో పవర్ ఫుల్‌ డైలాగ్‌ ను చెప్పిస్తున్నట్లుగా గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చాడు.

దర్శకులు మారినా.. కథలు మారిని కూడా బాలయ్య నోట సింహం డైలాగ్ లేదా బాలయ్య మరియు సింహం విజువల్స్ మాత్రం మారడం లేదు.. తగ్గడం లేదు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులు మాత్రం బాలయ్య సినిమా అంటే సింహం డైలాగ్‌ ఉండాల్సిందే.. బాలయ్య మరియు సింహం కలిపిన విజువల్స్ ఉండాల్సిందే అంటున్నారు. అభిమానులు మాత్రమే కాకుండా బాలయ్యతో సినిమాను నిర్మించే వారు.. బాలయ్య సినిమాలను కొనాలి అనుకునే వారు కూడా ఇవి కామన్‌ గా ఉండాలని కోరుకుంటున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌. అది బాలయ్య సినిమాకు సక్సెస్ ఫార్ములా కనుక ఎందుకు వదిలేయాలి అనేది కొందరి అభిప్రాయం. గోపీచంద్ మలినేని సినిమాలో బాలయ్య ను ఎంత పవర్‌ ఫుల్ గా చూపిస్తాడో సినిమా అంత సూపర్ హిట్‌ ఖాయం అంటూ అభిమానులు అంటున్నారు. క్రాక్ సినిమా లో రవితేజను విభిన్నంగా మాస్ గా చూపించి ఆకట్టుకున్న దర్శకుడు ఈసారి బాలయ్యను ఆ రేంజ్ లో చూపిస్తే ఖచ్చితంగా అభిమానులు ఫిదా అవ్వడం ఖాయం.



Tags:    

Similar News