టెంపరేచర్ పెంచేస్తున్న కపుల్

Update: 2017-01-01 16:57 GMT
హృతిక్ రోషన్ తో కలిసి లీసా హెడెన్ ఫోటో షూట్ చేసిందనే సంగతి ఇప్పటికే చెప్పేసుకున్నాం. వోగ్ మేగజైన్ కోసం ఈ జంట మామూలుగా రెచ్చిపోలేదు. పెళ్లయిపోయినా సరే ప్రొఫెషనల్ గా లీసా హెడెన్ ఎంత పర్ఫెక్ట్ గా బిహేవ్ చేయగలదో చూపించేసింది.

ఇప్పుడు అదే మేగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ లో మరో ఫోటో బయటకు వచ్చింది. హృతిక్ రోషన్ సిక్స్ ప్యాక్ చూపించి రెచ్చగొడుతుంటే.. అమ్మడు మాత్రం గ్లామర్ పార్ట్ తను తీసుకుంది. వింటర్ కదా అని స్వెటర్ వేసి కానీ.. బికినీ టైపులో ఉన్నఈ డ్రెసింగ్ భలే ఎట్రాక్టివ్ గా ఉంది. వోగ్ చేసిన స్పెషల్ ఇంటర్వ్యూలో భాగంగా ఈ భామ బోలెడన్ని కబుర్లు చెప్పింది. యోగ విషయంలో ఈమె చెప్పిన సంగతులు అందరినీ ఆశ్చర్యపరిచాయి. హాట్ హాట్ గా కనిపిస్తూ ఇద్దరూ కలిసి చూపరులకు టెంపరేచర్ పెంచేయడంలో మాత్రం బాగా సక్సెస్ అయ్యారు ఈ జంట.

30 ఏళ్ల వయసులో ఇంత ఫిట్ గా.. ఇంకా టీనేజ్ బ్యూటీలా కనిపించడానికి కారణం.. యోగానే అని చెప్పిన లీసా హెడెన్.. ఆరేళ్లవయసు నుంచే యోగ ప్రాక్టీస్ చేస్తోందట. ప్రస్తుతం అయితే యోగ విషయంలో కోచింగ్ కూడా ఇచ్చేయగల ట్యాలెంట్ సంపాదించేశానంటోంది లీసా హెడెన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News