కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే పెద్ద సినిమాల షూటింగ్స్ నిలిపివేశారు. కొన్ని సినిమాలు విదేశాలకు వెళ్లి చిత్రీకరణ జరుపుకుంటే.. మరికొన్ని చిత్రాలు ఇక్కడే కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ జరుపుకుంటున్నారు. 'అన్నాత్తే' వంటి పెద్ద సినిమాని తగు జాగ్రత్తలు తీసుకొని హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. అలానే టీవీ ఇండస్ట్రీలో సీరియల్స్ షో ల షూటింగ్స్ జరుగుతున్నాయి. నిన్నటి వరకు పెద్దగా ఆంక్షలు లేకపోవడంతో షూటింగ్స్ జరిగాయి. అయితే నేటి నుంచి తెలంగాణా రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. పది రోజులపాటు ఈ లాక్ డౌన్ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించడంతో.. షూటింగ్స్ అన్నీ ఆపేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతానికి లాక్ డౌన్ 10 రోజులు మాత్రమే అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. పరిస్థితులు చూస్తుంటే మరిన్ని రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే సినిమా మరియు టీవీ ఇండస్ట్రీల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది. గతేడాది లాక్ డౌన్ కారణంగా ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా షూటింగులు లేకపోవడంతో జూనియర్ ఆర్టిస్టులు - టెక్నిషియన్స్ - సినీ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వాలు షూటింగులకు అనుమతి ఇచ్చే వరకు వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ పెట్టడంతో అధికారికంగా షూటింగ్స్ బంద్ అయినట్టేనని చెప్పొచ్చు.
దీని వల్ల పరిస్థితులు అనుకూలిస్తే త్వరలోనే షూటింగ్స్ పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్న 'ఆదిపురుష్' 'అఖండ' 'అన్నాతే' వంటి సినిమాలకు ఇబ్బందే. అలానే ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న చిన్న సినిమాలు - వెబ్ సిరీస్ లు - ఒరిజినల్ మూవీస్ షూటింగ్స్ లాక్ డౌన్ తో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక సీరియల్స్ - టీవీ షో ల పరిస్థితి కూడా ఇంతే. లాక్ డౌన్ పొడిగిస్తే టెలికాస్ట్ చేయడానికి కంటెంట్ లేక గతేడాది మాదిరిగానే రిపీట్ గా ప్రసారం చేసే అవకాశాలు ఉన్నాయి. లాక్ డౌన్ ప్రభావం సినిమా మరియు టెలివిజన్ ఇండస్ట్రీలపై ఏ స్థాయిలో ఉంటుందనే దానిపై రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుంది.