ఆ హీరోకి పెళ్లి ఇప్పుడు అవసరమా?

Update: 2020-04-17 05:30 GMT

ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తున్న నేపథ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ ను విధించారు. దీనితో దేశంలో జన జీవనం స్తంభించిపోయింది. ఈ లాక్ డౌన్  కారణంగా దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. కానీ , ఒక హీరో మాత్రం దేశం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా తన పెళ్లి పనులలో బిజీ అయిపోయారు. ముందు అనుకున్న ముహుర్తానికే ఎలాగైనా పెళ్లి జరిగిపోవాలనే దృఢ నిచ్ఛయంతో కరోనా విజృంభిస్తున్న కూడా పెళ్లి పనులని చక చక పూర్తి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా పెళ్లి కావాలనుకునే ఆ యువ హీరో ఎవరబ్బా అని అనుకుంటున్నారా ..ఆ హీరో మరెవరో కాదు ,కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి కుమారుడు నిఖిల్. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు నిఖిల్ గతంలో జాగ్వర్ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

కాగా .. నిఖిల్, మాజీ మంత్రి ఎం కృష్ణప్ప మనవరాలు రేవతిల వివాహ నిశ్చితార్థం కొద్ది నెలల క్రితం బెంగళూరుకు సమీపంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత వీరి  పెళ్లికి ఏప్రిల్ 17వ తేదీన ముహుర్తం నిర్ణయిచారు. దీనితో ఎలాగైనా కూడా ముందుగా అనుకున్న ముహుర్తానికే పెళ్లి జరిపించాలని మాజీ సీఎం కుమారస్వామి నిర్ణయం తీసుకోని , దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తూ ముందుకుపోతున్నారు. కర్ణాటకలో కరోనావైరస్ రహిత ప్రాంతంగా రామనగర్ జిల్లాను ప్రకటించారు. ఈ జిల్లాను గ్రీన్ జోన్‌ గా ప్రకటించడంతో , ఆ జిల్లాలో ఉన్న తమ ఫామ్‌ హౌస్‌ లో నిఖిల్ కుమారస్వామి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు .అయితే , అక్కడ పనులు చేస్తున్న కూలీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనిచేయడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.

మాజీ సీఎం కుమారస్వామి తాజాగా ప్రెస్‌ మీట్‌లో మాట్లాడుతూ.. కేవలం 80 మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలను రావొద్దని స్పష్టం చేశారు. అయితే, ఈ హై ప్రొఫైల్ పెళ్లికి సుమారు 500 మందికిపైగా హాజరయ్యే అవకాశం ఉందని కొందరు చెప్తున్నారు. మరో ముఖ్య కారణం కుమారస్వామి గ్రహాస్థితి బట్టి ప్రస్తుతం పెట్టిన ముహుర్తమే నిఖిల్‌ కు మంచిదని , భావించి ఎన్ని వివాదాలు చుట్టుముడుతున్నా వెనుకడుగు వేయకుండా పెళ్లి పనులలో బిజీగా ఉన్నారు.

 దీనిపై హోం మంత్రి బోమ్మై మాట్లాడుతూ.. అది కేవలం ఓ కుటుంబంలో జరిగే ప్రైవేట్ వేడుక. లాక్‌ డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా జరపడం లేదు అని , కేవలం 50 మంది కుటుంబ సభ్యులే హాజరవుతున్నారు అని, అలాగే వారి కుటుంబంలో చాలా మంది డాక్టర్లు ఉన్నారు. అన్నీ జాగ్రత్తలు తీసుకొన్న తర్వాతనే ఈ వివాహాన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య  జరిపించబోతున్నట్టు తెలిపారు. మొత్తంగా దేశం ఒకవైపు కరోనా తో పోరాటం చేస్తుంటే ఈ హీరోకి ఇప్పుడు పెళ్లి అవసరమా అంటూ ..మీడియా లో , రాజకీయ వర్గాలలో పెద్ద చర్చలు జరుగుతున్నాయి.
Tags:    

Similar News