నాని అనగానే మా పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాడు .. మా కాలనీ కుర్రాడిలా కనిపిస్తాడు అని చెబుతుంటారు. నిజమే నాని అంత సహజంగా నటిస్తుంటాడు. కథ ఏదైనా .. పాత్ర ఏదైనా అందులో అతి చూపించడు. ఎక్కడ ఎంత వరకు అవసరమో అంతవరకూ మాత్రమే నటించడమనేది నానీకి బాగా తెలిసిన విద్య. తనకి గల నేచురల్ స్టార్ అనే పేరుకు తగినట్టుగానే తెరపై నాని చాలా సాదాసీదాగా కనిపిస్తూ మంచి మార్కులు కొట్టేస్తూ వచ్చాడు. తన దగ్గరికి వచ్చిన ప్రతి కథను కాకుండా, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే పాత్రలను చేస్తూ వచ్చాడు.
కథాకథనాలలోని కొత్తదనానికి నాని ప్రాధాన్యతనిచ్చాడు. కానీ ఎప్పుడూ కూడా ఆయన పాత్ర పరంగా పూర్తిగా మారిపోయే లుక్ కోసం ట్రై చేయలేదు. అవసరమైతే కాస్త క్రాఫ్ ను పైకో .. పక్కకో దువ్వడం .. మీసకట్టును వంకీ తిప్పడం .. గెడ్డం తీయడమో .. కాస్త పెంచడమే చేసేవాడు అంతే .
అది కూడా అప్పుడప్పుడు మాత్రమే. అలాంటి నాని ఈ మధ్య కాలంలో తన రూటు మార్చినట్టుగా కనిపిస్తున్నాడు. 'శ్యామ్ సింగ రాయ్'లో నాని లుక్ అంతకుముందు ఆయన చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. ఆ సినిమాలో ఆయన లుక్ డీసెంట్ గా .. రాయల్ గా కనిపిస్తుంది.
ఒక పాత్ర కోసం నాని తనని తాను పూర్తిగా మార్చుకోవడం ఈ సినిమాతోనే జరిగిందని అనుకోవచ్చు. నాని ప్రయత్నానికి తగినట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆయన కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఆ తరువాత 'అంటే .. సుందరానికీ' సంబంధించిన వీడియో .. 'దసరా' సినిమాకి సంబంధించిన పోస్టర్ బయటికి వచ్చిన తరువాత, నాని వరుస ప్రయోగాలకు తెరలేపాడనే విషయం అర్థమైంది. 'అంటే .. సుందరానికీ' చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్. 'అంటే .. సుందరానికీ' అనే టైటిల్ వెనుక అనేక సందేహాలు కనిపిస్తాయి.
ఈ సినిమాలో నాని మీసాలు లేకుండా .. అమాయకంగా కనిపిస్తాడు. ఆచార వ్యవహారాలకు మధ్య నలిగిపోయే యువకుడిగా నవ్వులు పూయిస్తాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా లుక్ పరంగా నానీలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించేదే. ఇక ఆ తరువాత ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'దసరా' చేస్తున్నాడు.
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని ఊరమాస్ లుక్ తో కనిపించనున్నాడు. బహుశా ఇంత మాస్ లుక్ తో ఆయన కనిపించడం ఇదే ఫస్టు టైమ్ అనుకుంటా. కథాకథనాలతో పాటు లుక్ పరంగా తనని తాను మార్చుకుంటూ వెళుతున్న నాని, మున్ముందు ఎలాంటి ఎలాంటి ప్రయోగాలు చేస్తాడో .. ఎలాంటి ఫలితాలు చూస్తాడో!