మలయాళ 'లూసిఫర్' తెలుగులో వర్కౌట్ అవుద్దా...?

Update: 2020-05-09 01:30 GMT
'ఖైదీ నెం.150' తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెడుతూ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. గతేడాది 'సైరా నరసింహా రెడ్డి'తో పలరించిన చిరు ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న 'ఆచార్య' లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలుపుదల చేసుకుంది. ఈ మూవీ దీపావళి లేదా క్రిస్మస్ కానుకగా విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు. 'ఆచార్య' సినిమా తర్వాత మెగాస్టార్ మరో మూడు సినిమాలు చేయబోతున్నారు. ఇప్పటికే ఆ సినిమాలకు సంబందించిన కథలు విన్న చిరు ఇటీవల బాబీ, సుజిత్, మెహర్ రమేష్ లతో సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ముందుగా మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు మెగాస్టార్. పొలిటికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించనున్నాడు. ఈ రీమేక్ కు 'సాహో' ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే మన నేటివిటీకి తగ్గట్లు తగినన్ని మార్పులు చేస్తున్నాడట సుజీత్. అయితే ఇప్పుడు ఈ మలయాళ రీమేక్ తెలుగులో వర్క్ అవుట్ అవుద్దా అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తోంది.

మలయాళ 'లూసిఫర్' చిత్రంలో హీరో మిడిల్ ఏజ్ మ్యాన్ క్యారక్టర్ లో కనిపిస్తాడు. అంతేకాకుండా ఒరిజనల్ కథలో మోహన్‌ లాల్‌ కు హీరోయిన్ ఉండదు.. పాటలు కూడా ఉండవు. మరి అదే రోల్ ఇక్కడ చిరంజీవి చేస్తుండగా ఆయన పక్కన హీరోయిన్ లేకుండా మూవీ వర్క్అవుట్ అవుతుందా లేదా అనే ఆలోచన అందర్లోనూ ఉంది. చిరంజీవి పక్కన హీరోయిన్ లేకపోతే ఫ్యాన్స్ ఊరుకోరు. స్టోరీ ఎలా ఉన్నా చిరంజీవి హీరో కాబట్టి ఖచ్చితంగా హీరోయిన్ పెట్టాల్సిన అవసరం ఉంది. గతంలో హీరోయిన్ లేకుండా స్టార్ హీరోలు నటించిన సినిమాలు మన ఆడియన్స్ రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులోనూ మెగాస్టార్ అంటే ఆయన నుండి డ్యాన్స్ కామెడీ ఖచ్చితంగా ఎక్సపెక్ట్ చేస్తారు. కానీ 'లూసిఫర్' సినిమాలో అలాంటివి ఏమీ హీరో పాత్రకి ఉండవు. దీంతో కథలో భారీ మార్పులు చేర్పులు జరుగుతున్నాయట. మెగాస్టార్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని సుజీత్ తెలుగు వర్షన్ లో కీలక మార్పులు చేస్తున్నాడని సమాచారం. మరి ఇన్ని మార్పులు చేర్పులతో రాబోతున్న ఈ సినిమా మలయాళ 'లూసిఫర్' సోల్ మిస్ అవ్వకుండా బయటకి వస్తుందా.. అసలు తెలుగులో వర్కౌట్ అవుతుందా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. తమిళ 'కత్తి'ని మార్పులు చేయకుండా 'ఖైదీ నెం.150'గా హిట్ కొట్టిన మెగాస్టార్.. 'లూసిఫర్'లో చేంజెస్ చేసి హిట్ కొడతాడేమో చూడాలి.
Tags:    

Similar News