నాగచైతన్య మరియు సాయి పల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరీ విడుదల గత ఏడాది కాలంగా అదుగో ఇదుగో అన్నట్లుగానే ఉంది. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన సినిమా అవ్వడం వల్ల.. ఫిదా బ్యూటీ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటికే పలు సార్లు ప్రకటించి క్యాన్సిల్ చేయడం జరిగింది. సెకండ్ వేవ్ తర్వాత సెప్టెంబర్ 10న సినిమా అంటూ ప్రకటించి మళ్లీ విడుదల వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొన్నారు. విడుదల తేదీ విషయంలో త్వరలో స్పష్టత ఇస్తారని అనుకుంటూ ఉన్న సమయంలో ఇప్పట్లో విడుదల ఉంటుందా అనే అనుమానాలు కలిగేలా మేకర్స్ వ్యవహరిస్తున్నారు.
లవ్ స్టోరీ ఖచ్చితంగా భారీ వసూళ్లు సాధించగలిగే సత్తా ఉన్న సినిమా అనడంలో సందేహం లేదు. సరిగ్గా థియేటర్లు ఉంది టికెట్ల రేట్లు కాస్త ఎక్కువగా ఉంటే సినిమా ఓపెనింగ్స్ ఈజీగా 50 కోట్లు ఉంటాయి. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మరో 50 కోట్ల వరకు వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. అంటే మొత్తంగా వంద కోట్ల సినిమా ఇది అనడంలో సందేహం లేదు. అలాంటి సినిమాను ఈ సమయంలో విడుదల చేసి పాతిక కోట్లకే పరిమితం చేయవద్దు అనేది మేకర్స్ అభిప్రాయంగా తెలుస్తోంది.
చిన్న బడ్జెట్ సినిమాలు విడుదల అయినా పర్వాలేదు కాని ఇప్పుడు భారీ సినిమాలు.. మీడియం రేంజ్ సినిమా లు విడుదల అవ్వడం వల్ల నష్టం తప్ప లాభం లేదు అనేది కొందరి బలమైన నమ్మకం. అందుకే లవ్ స్టోరీ సినిమా విడుదల విషయంలో వెనుక ముందు ఆడుతున్నారు. ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఉన్న టికెట్ల రేట్లు కొనసాగితే మాత్రం అక్కడ వసూళ్లు చాలా దారుణంగా ఉంటాయి. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా సినిమా కు వచ్చే వసూళ్లు మరీ దారుణంగా ఉంటాయి అనేది టాక్. అందుకే అక్కడ టికెట్ల రేట్ల పై స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే లవ్ స్టోరీని విడుదల చేసే విషయమై ఆలోచిస్తున్నారు అనేది మీడియా వర్గాల టాక్.