కోవిడ్ సెకండ్ వేవ్, లాక్ డౌన్ కారణంగా వేసవిలో విడుదలకు సిధ్దమైన సినిమాలన్నీ.. చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే.. మరికొన్ని చిత్రాలు మాత్రం థియేట్రికల్ విడుదలకే మొగ్గు చూపాయి. బిగ్ స్క్రీన్ మీదకు రావాలని వెయిట్ చేస్తున్న సినిమాల జాబితాలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ''లవ్ స్టోరీ'' కూడా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సినిమా హాళ్లు తిరిగి తెరుచుకున్నాయి. ప్రేక్షకులు నెమ్మదిగా థియేటర్లలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలన్నీ వరుసగా థియేటర్లకు క్యూ కడుతున్నాయి. కానీ 'లవ్ స్టోరీ' వంటి క్రేజీ మూవీస్ మాత్రం విడుదల తేదీపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 10న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
'ఫిదా' తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ''లవ్ స్టోరీ'' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నాగ చైతన్య సరసన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై కె.నారాయణదాస్ నారంగ్ - పి. రామ్మోహన్ రావు కలసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 16న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా.. కరోనా పరిస్థితుల కారణంగా పోస్ట్ పోన్ అయింది.
ఇప్పుడు సెప్టెంబర్ 10న 'లవ్ స్టొరీ' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఈలోపున ఎలాంటి విపత్కర పరిస్థితులు రాకపోతే పక్కా ఈ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేస్తారు. అయితే పొరపాటున ఏదైనా జరిగితే మాత్రం ఓటీటీ విడుదలకు వెళ్లే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. అంతేకాదు థియేటర్లలోకి రావడం ఇంకాస్త లేట్ అయితే.. నాని 'టక్ జగదీష్' తో పోటీ పడే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.