చైతన్య 'లవ్ స్టోరీ' బిజినెస్ ఆ రేంజ్ లో జరుగుతోందా..?

Update: 2021-03-16 14:02 GMT
యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య - నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''లవ్ స్టోరీ''. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ అందమైన ప్రేమ కావ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 16న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు 'ఏయ్ పిల్లా' 'నీ చిత్రం చూసి' 'సారంగ దరియా' సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక సారంగ దరియా పాట అయితే తక్కువ సమయంలో 50 మిలియన్ మార్క్ అందుకున్న టాలీవుడ్ సాంగ్ గా రికార్డ్ నమోదు చేసింది. ఈ క్రమంలో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకున్న 'లవ్ స్టోరీ' ప్రీ బిజినెస్ కూడా బాగా జరుగుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

'ఫిదా' తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా కావడం.. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ విశేష ఆదరణ తెచ్చుకోవడంతో ఈ సినిమా రైట్స్ కి మంచి డిమాండ్ ఏర్పడిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 30 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు టాక్ నడుస్తోంది. ఎలాగూ శేఖర్ కమ్ముల సినిమాలకు ఓవర్ సీస్ లో మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మంచి ధర పలికే అవకాశం ఉంది. ఇక శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ అన్నీ కలుపుకొని 45 నుంచి 50 కోట్ల వరకు 'లవ్ స్టోరీ' బిజినెస్ జరగొచ్చని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే హాట్ సమ్మర్ లో ప్రేక్షకులకు ఈ లవ్ స్టోరీ ఏ రేంజ్ లో కూల్ చేస్తుందో చూడాలి.

ఇకపోతే ఈ చిత్రంలో రాజీవ్ కనకాల - ఈశ్వరీరావు - దేవయాని ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పవన్ సి.హెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నారాయణదాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.




Tags:    

Similar News