విరుష్క జంట మ‌ళ్లీ మంట పెట్టిందిగా

Update: 2022-06-09 02:30 GMT
అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ ఇండస్ట్రీ హాటెస్ట్ కపుల్స్ గా పాపుల‌రైన సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియాల్లో వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఫోటోలు వీడియోల రూపంలో షేర్ చేస్తూ నిరంత‌రం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఈ ఆద‌ర్శ‌ జంట ఫ్యాన్స్ కి టార్గెట్స్ ఎక్స్ ని ఫిక్స్ చేయ‌డంలో ఎప్పుడూ విఫలం కాలేదు. తాజాగా హబ్బీ విరాట్ తో క‌లిసి అనుష్క స్మైలీ లుక్ తో ఉన్న సెల్ఫీని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇది నిమిషాల్లోనే అంత‌ర్జాలంలో సునామీగా మారింది.

తాజా లుక్ లో అనుష్క‌ సౌకర్యవంతమైన స‌మ్మ‌ర్ లుక్ తో క‌నిపించింది.  ఆకుపచ్చ స్పఘెట్టి టాప్ లో తీరైన రూపంతో ముసిముసిగా న‌వ్వుతూ మురిపించింది. బ్రౌన్ స్లీవ్స్ టీ-షర్ట్ లో విరాట్ అంతే స్టీమీ లుక్  తో కనిపించాడు. విరాట్ మ‌జిల్స్ పై టాటూలు హైలైట్ గా క‌నిపిస్తున్నాయి.
అనుష్క నో-మేకప్ లుక్ లో తన సహజమైన మెరుపును చూపిస్తూ ఆకట్టుకోగా.. విరాట్ అందుకు భిన్నంగా నిండుగా పెరిగిన గడ్డంతో మ్యాచోలా కనిపించాడు. ఇంత‌కుముందే ముంబై విమానాశ్రయంలో విరుష్క జంట‌ కనిపించింది. దంపతులిద్దరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని విమానాశ్రయానికి వ‌స్తూ క‌నిపించారు. ఫోటోగ్రాఫ‌ర్ల‌కు పోజులిచ్చి మర్యాద పూర్వ‌క విషెస్ తో హృదయాలను గెలుచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ జంట‌ అభిమానుల్లో వైర‌ల్ అయ్యింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అనుష్క శర్మ చివరిసారిగా ఆనంద్ ఎల్ రాయ్ తెర‌కెక్కించిన `జీరో`లో షారుఖ్ ఖాన్ - కత్రినా కైఫ్ లతో కలిసి కనిపించింది. జబ్ తక్ హై జాన్ త్రయం పెద్ద స్క్రీన్ పై మ్యాజిక్‌ను మళ్లీ సృష్టించడంలో విఫలమైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ ఘోరంగా విఫ‌ల‌మైంది. భారత మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్ అయిన `చక్దా ఎక్స్‌ప్రెస్‌`తో ఆమె తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వ‌నుంది అనుష్క‌. నెట్ ఫ్లిక్స్ లో విడుదలకు సిద్ధ‌మ‌వుతున్న ఈ సినిమా కోసం తీవ్రమైన ప్రిప‌రేష‌న్ లో ఉంది.

అనుష్క వ్యక్తిగత జీవితం గురించి ప్ర‌స్తావిస్తే.. అనుష్క‌- విరాట్ జంట ఆద‌ర్శ జీవ‌నం నిరంత‌రం అభిమానుల‌కు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ జంట‌కు వామిక అనే క్యూటీ డాట‌ర్ ఉంది. వామిక చూస్తుండ‌గానే బుడి బుడి న‌డ‌క‌ల‌తో చ‌క‌చ‌కా ఎదిగేస్తోంది. ఈ జంట 2017లో పెళ్లి చేసుకున్నారు. అనుష్క ఇటీవ‌లే గోద్రేజ్ ఉత్ప‌త్త‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా భారీ కాంట్రాక్టును కుదుర్చుకుంది. మామ్ అయ్యాకా ఈ బ్యూటీకి వాణిజ్య ప్ర‌పంచంలో ఏమాత్రం క్రేజ్ త‌గ్గ‌లేదు.
Tags:    

Similar News