మాస్ రాజా రవితేజ కెరీర్ లో హిట్స్ ఫ్లాప్స్ ఏదైనా వెంటనే మరో సినిమా ప్రారంభిస్తాడు. ఈ ఏడాది క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మాస్ రాజా తదుపరి సినిమాల ఎంపికలో జోరు అసలు తగ్గించడం లేదు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రవితేజ డ్యూయెల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాతో ఇద్దరూ కొత్త హీరోయిన్స్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే మాస్ రాజాతో చాలామంది కొత్త హీరోయిన్స్ ఇంట్రడ్యూస్ అయ్యారు. అందులో ముంబై బ్యూటీ మాళవిక శర్మ ఒకటి. అలాగే తాజాగా రవితేజ నెక్స్ట్ సినిమా గురించి ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి. రవితేజ తదుపరి సినిమా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో చేయనున్నాడు.
ఈ సినిమా 1980 కాలం నాటి నేపథ్యంలో కొనసాగుతుందనేది టాక్. కామెడీ ఎంటర్టైనర్ అయినప్పటికీ, బలమైన ఎమోషన్స్ ఉంటాయని అంటున్నారు. ఇదివరకు త్రినాథరావు ‘సినిమా చూపిస్తమావ’ ‘నేను లోకల్’ లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. అదే తరహాలో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రవితేజ సినిమా ఉంటుందని ఎక్సపెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫ్యాన్స్ మాత్రం రవితేజ, త్రినాథరావు కాంబినేషన్ మూవీ అంటే కొత్తగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ మల్టీ హీరోయిన్స్ కనిపించనున్నారు. ఇప్పటికే ఐశ్వర్యమీనన్, శ్రీలీల హీరోయిన్స్ గా సెలెక్ట్ అయ్యారట. అలాగే గాలిసంపత్ ఫేమ్ లవ్లీ సింగ్ కూడా రవితేజ సినిమాలో ఛాన్స్ అందుకుందని పుకార్లు వైరల్ అవుతున్నాయి. మరి అసలు నిజమేంటి.. లవ్లీ సింగ్ మెయిన్ హీరోయిన్ గా చేస్తోందా.. లేక కొన్ని సీన్స్ కే పరిమితం అయ్యిందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి రవితేజ సరసన అందరూ కూర్రభామలు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.