దిల్ రాజు వ్యూహం బెడిసికొట్టిందా?

Update: 2018-07-22 13:30 GMT
చిన్న సినిమాల్ని ఎక్కువ హైప్ లేకుండా విడుద‌ల చేయాలి. మౌత్ ప‌బ్లిసిటీ పెరిగాక దాన్ని మ‌రింత మందికి చేరువ‌య్యేలా చేయాల‌నే కాన్సెప్టు దిల్‌ రాజుది. `కేరింత` విష‌యంలో అదే చేశాడు.  అయితే అది అన్ని సినిమాల‌కీ వ‌ర్కవుట్ కాద‌నే విష‌యాన్ని గ్ర‌హించ‌లేక‌పోయాడు. ఇటీవ‌ల త‌న సంస్థ‌లో తెరకెక్కిన `ల‌వ‌ర్‌`కి కూడా అదే వ్యూహం పాటించాడు. సినిమా విడుద‌ల‌కి ముందు పెద్ద‌గా ప్ర‌మోష‌న్లు చేయ‌లేదు. వేడుకల్లో కూడా సినిమాపై పెద్ద‌గా అంచ‌నాలు త‌న‌కే లేవ‌న్న‌ట్టుగా మాట్లాడాడు. అది సినిమా వ‌సూళ్ల‌పై బాగా ప్ర‌భావం చూపించింది.

ఈ వ్యూహం ఏమాత్రం వ‌ర్క‌వుట్ కాలేద‌నే విష‌యం తొలి రెండు రోజులు వ‌సూళ్లే స్ప‌ష్టం చేశాయి. దిల్‌ రాజు సినిమానే అన్నంత‌గా తొలి రోజు కేవ‌లం 50 ల‌క్ష‌ల షేర్ వ‌చ్చింద‌ట‌. అది దిల్‌ రాజు కెరీర్‌ లోనే పూర్ అని చెప్పొచ్చు.  రాజ్‌ త‌రుణ్ మార్కెట్ కొంత‌కాలంగా దారుణంగా ప‌డిపోయింది. ఆయ‌న‌కి హిట్టు లేక చాలా కాల‌మైంది. మొన్న‌టికి మొన్న రాజుగాడు సినిమా విడుద‌లైతే థియేట‌ర్ల‌లో ఒక‌రిద్ద‌రు మిన‌హా క‌నిపించ‌లేదు. అలాంటి ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు సినిమాల‌కి ప‌బ్లిసిటీ కీల‌కం. కాని దిల్‌రాజు ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోలేదు. సినిమాకి టాక్ వ‌చ్చాకే  ప‌బ్లిస‌టీ స్ప్రెడ్  చేద్దామ‌నుకొన్నాడు. కానీ ఆ సినిమాని చూడ్డానికే జ‌నం వెళ్లలేదు. ఇక మౌత్ ప‌బ్లిసిటీ  ఎలా వ‌స్తుంది?  రాజ్‌ త‌రుణ్ కెరీర్‌ లోనే అత్య‌ధిక బ‌డ్జెట్‌ తో తెర‌కెక్కిన ఈ సినిమాకి భారీ న‌ష్టాలు త‌ప్ప‌వ‌ని - పెట్టిన పెట్టుబ‌డిలో నాలుగోవంతు కూడా రావ‌డం క‌ష్ట‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
Tags:    

Similar News