సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఏషియన్ ఆధ్వర్యంలో రన్ అవుతున్న ఏఎంబీ మల్టీ ప్లెక్స్ లో సెకండ్ వేవ్ తర్వాత అరుదైన రికార్డ్ నమోదు అయ్యింది. ఇటీవల విడుదల అయిన లవ్ స్టోరీ సినిమా ఏఎంబీ థియేటర్ లో కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 251 షో లు లవ్ స్టోరీ ని ఏఎంబీలో ప్రదర్శించారు. ఇప్పటి వరకు మొత్తంగా 48233 మంది లవ్ స్టోరీ సినిమాను చూశారు. నాగచైతన్య మరియు సాయి పల్లవిల ఈ సినిమా సక్సెస్ టాక్ దక్కించుకుని సెకండ్ వేవ్ తర్వాత అతి పెద్ద విజయంగా నిలిచింది. లవ్ స్టోరీ ఆహా స్ట్రీమింగ్ కు సిద్దం అయినా కూడా ఇంకా థియేటర్లలో జనాలు లవ్ స్టోరీని చూసేందుకు ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు.
ఏఎంబీ మల్టీ ప్లెక్స్ లో ఇంత భారీ మొత్తంలో వసూళ్లు దక్కించుకున్న సినిమాలు చాలా అరుదు అనడంలో సందేహం లేదు. లవ్ స్టోరీ సినిమా మాస్ క్లాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క సినీ ప్రియులను ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏఎంబీ మల్టీ ప్లెక్స్ లో విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా లవ్ స్టోరీ రన్ అవుతూనే ఉంది. కోటి రూపాయల వసూళ్లు దక్కించుకున్న లవ్ స్టోరీ అరుదైన ఫీట్ ను దక్కించుకుంది. ఒక్కే థియేటర్ లో కోటి అంతకు మించి వసూళ్లు దక్కించుకోవడం కేవలం స్టార్స్ కు సూపర్ స్టార్స్ కు మాత్రమే సాధ్యం. ఈసారి ఆ ఫీట్ ను లవ్ స్టోరీ దక్కించుకోవడం అరుదైన విషయం.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఒక మంచి కాన్సెప్ట్ మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆకట్టుకునే కథ మరియు కథనాలతో పాటు సాయి పల్లవి మరియు నాగ చైతన్యల కాంబోకు మంచి మార్కులు పడ్డాయి. ఆకట్టుకున్న స్టార్ కాస్టింగ్ కు తోడు పాటలు కూడా చక్కగా కుదిరాయి. మొత్తంగా శేఖర్ కమ్ముల ఒక మంచి సినిమాను కాస్త ఆలస్యం అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి సక్సెస్ ను దక్కించుకున్నాడు. శేఖర్ సినిమాను ఏషియన్ సంస్థ నిర్మించిన విషయం తెల్సిందే. పంపిణీ రంగంలో.. థియేటర్ రంగంలో సుదీర్ఘ కాలంగా ఉన్న ఏషియన్ వారు నిర్మాణంలో కూడా సక్సెస్ అయ్యారు.