కుదురైన అందానికి పద్ధతిగా పట్టుచీర కడితే ఎలా ఉంటుందో .. రీతూ వర్మ అలా ఉంటుంది. పంట పొలాల మీదుగా పరిగెత్తుకు వచ్చే పైరగాలిలా ఉంటుంది. అలాంటి రీతూ వర్మ 'బాద్ షా' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కథానాయికగా ఆమె 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో అలరించింది. ఆ తరువాత 'పెళ్లిచూపులు' సినిమాతో ఒక సూపర్ హిట్ ను ఆమె తన ఖాతలో వేసుకుంది. ఈ రెండు సినిమాల్లోను ఆమె తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను చేయడం వలన అవి జనానికి బాగా కనెక్ట్ అయ్యాయి.
ఇక 'టక్ జగదీష్' సినిమాలో కూడా ఆమె వీఆర్వో పాత్రలో కనిపించింది. ఈ కథ అంతా కూడా ఉమ్మడి కుటుంబంలోని ఎమోషన్స్ చుట్టూనే ఎక్కువగా తిరుగుతుంది. కథ ఆ కుటుంబాన్ని దాటుకుని హీరోయిన్ వరకూ వచ్చే అవకాశం లేకపోయివడం వలన, ఆమె చేయడానికి అక్కడ ఏమీ లేదు. ఇక 'వరుడు కావలెను' కూడా తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రనే. 'పెళ్లి చూపులు'ను పోలిన కథనే. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ సరైన సమయంలో విడుదల కాకపోవడం వలన, ఆశించినస్థాయిని అందుకోలేకపోయిందనే టాక్ వచ్చింది.
ఈ నేపథ్యంలోనే రీతూ వర్మ .. తమిళ హీరో శివకార్తికేయన్ తో ఒక సినిమా చేయడానికి అంగీకరించినట్టుగా తెలుస్తోంది. దుల్కర్ జోడీగా చేసిన 'కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్' హిట్ తో అక్కడి ప్రేక్షకులకు ఆమె పరిచయమే. ఇటీవల 'డాక్టర్' సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన శివకార్తికేయన్, 'రెమో' సినిమా నుంచే ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం. 'జాతిరత్నాలు' సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న అనుదీప్, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు.
తెలుగుతో పాటుగా తమిళంలోను ఈ సినిమా విడుదల కానుంది.
ఇక రీతూ వర్మ తరువాత సినిమాగా ఆల్రెడీ 'ఒకే ఒక జీవితం' లైన్లోనే ఉంది. శర్వానంద్ జోడీగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది. దర్శకుడిగా శ్రీకార్తీక్ పరిచయమవుతున్న ఈ సినిమాకి, జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ చాలా తక్కువ. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలవుతాయని అంటున్నారు. తన మార్కు పాత్రలనే ఎంచుకుంటూ వెళుతున్న రీతూ వర్మకి, ఈ సినిమాతోనైనా హిట్ పడుతుందేమో చూడాలి.