లక్కీ నితిన్.. లైన్ లో నలుగురు దర్శకులు!

Update: 2022-10-17 06:34 GMT
టాలీవుడ్ హీరోల్లో సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న వారిలో నితిన్ టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. అతని కెరీర్ అయితే మొదట్లో జయం దిల్ సినిమాలతో చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. దీంతో టాలెంట్ తో పాటు చాలా లక్కున్న హీరో అని ఒక బ్రాండ్ అయితే సెట్ చేసుకున్నాడు.

కానీ ఆ తర్వాత మాత్రం సరైన కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకోకపోవడం అతన్ని చాలా ఇబ్బందుల్లో పడేసింది. అంతేకాకుండా మాస్ కమర్షియల్ సినిమాలు చాలా రొటీన్ గా తీస్తూ ఉండడంతో నితిన్ చాలాసార్లు డిజాస్టర్స్ ఎదుర్కొన్నాడు. నితిన్ అదృష్టం ఏమిటో గాని ఒక సినిమా హిట్ అయితే మళ్లీ వరుసగా మూడు నాలుగు డిజాస్టర్ అందుకోవాల్సి వస్తోంది.

దీన్ని బట్టి అతను లక్కుతో సక్సెస్ అంటుకుంటున్నాడా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక 2020లో భీష్మ సినిమా సక్సెస్ కొట్టిన తర్వాత వరుసగా మూడు సినిమాలతో డిజాస్టర్ అందుకున్నాడు. గత ఏడాది వచ్చిన చెక్, రంగ్ దే సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఆ తర్వాత మాస్ట్రో ఓటీడీలో విడుదల అయింది.

ఇక ఇటీవల వచ్చిన మాచర్ల నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయినప్పటికీ కూడా మనోడి చేతిలో ఇప్పుడు వరుసగా నాలుగు నలుగురు టాలెంటెడ్ దర్శకులు ఉన్నారు. ముందుగా అయితే వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమాను పూర్తి చేయబోతున్నాడు.

ఆ తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఒక సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. వీరి కలయికలో ఇంతకుముందు భీష్మ సినిమా వచ్చింది. అలాగే మాస్ యాక్షన్ దర్శకుడు సురేందర్ రెడ్డి తో కూడా సినిమా చేయాలని ఎదురు చూస్తున్న నితిన్ కు మొత్తానికి కథ సెట్ అయినట్లు సమాచారం. ఇక ఈ లైన్లో భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ చంద్ర కూడా ఉన్నాడు. ఈ విధంగా నితిన్ అయితే ఫ్లాప్ లో ఉన్నప్పటికీ వరుసగా నలుగురు దర్శకులను ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News