విరోధాభాసాలంకారము-వీరయ్య పాటపై చంద్రబోసు వివరణ

Update: 2022-12-29 10:31 GMT
అభాసత్వే విరోధస్య విరోధాభాస ఉచ్యతే ..విరోధాభాసాలంకారం నిర్వచనం. పైకి కనిపించే విరోధం లోతుగా ఆలోచిస్తే అది అభాసం అవుతుంది. అంటే పోతుంది అని అర్ధం అని ప్రముఖ సినీ రచయిత చంద్రబోస్ తెలిపారు.  ఇలా విరోధాభాసాలంకారాన్ని వాడుకుని తాను అనేక అందమైన పదాలతో తో అర్ధవంతంగా అల్లిన పాట వాల్తేరు వీరయ్యలోనిదని  చంద్రబోస్ అన్నారు. తాను రాసిన పాట మీద ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తో పాటు సోషల్ మీడియాలో కొందరు  అభ్యంతరాలను వ్యక్తం చేయడం పట్ల ఆయన స్పందిస్తూ పూర్తి వివరణను ఇచ్చారు.

విరోధాభాసాలంకారం గొప్పతనం ఏంటి అంటే బయటకు కనిపించే అర్ధం ఒకటైతే లోపల మరోటి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. దానికి ఆయన అనేక ఉదాహరణలు ఇచ్చారు. తన పాటలో తుపాను అంచున తపస్సు చేసే వశిష్టుడు అన్న పద ప్రయోగం చేయడం వెనక చాలా అర్ధం ఉందని అన్నారు. వశిష్టుడు బ్రహ్మ యొక్క తేజోబలంగా పురాణాలు చెబుతాయని ఆయన పేర్కొన్నారు. అలాగే బ్రహ్మ మానస పుత్రుడు వశిష్టుడు అని ఆయన వివరించారు.

వశిష్టుడు బ్రహ్మరుషులలో అగ్రగణ్యుడు. అలాగే సప్త మహా రుషులలో ఉత్తముడు, నవ బ్రహ్మలలో ఒకడు, ఇక్ష్వాకుల గురువు అంతే కాదు అరుంధతీ ప్రియుడు, శాంత ప్రియుడు కూడా అని ఆయన అన్నారు. ఆయన ప్రశాంత చిత్తంతో ఎపుడూ ఉండేవాడు. అలాంటి వశిష్టుడి తుపాను అంచున కూడా ప్రశాంతంగా తపస్సు చేసుకునే వ్యక్తిత్వం  తత్వం కలిగిన  వాడుగా తన గీతంలో అభివర్ణించినట్లుగా పేర్కొన్నారు. అలాంటి వాడే హీరో కాబట్టే అలా రాశాను అని ఆయన చెప్పారు.

ఇక ఎర్రని కపోతం అని తన పాటలో రాశాను అని నిజానికి ఎర్రని కపోతం ఉంటుందా అది కూడా విరోధాబాసం అలంకారమే అని ఆయన వివరించారు. ప్రశాంతంగా ఉండే కపోతాన్ని అలా వర్ణించామని అన్నారు. ఇక మరణ శంఖమై మారుమోగే ప్రశాంతుడు అని ఒక చోట రాశాను అని ఆయన చెబుతూ దానిలో ఉన్న నిగూఢమైన భావనను కూడా వివరించారు. మౌనంగా ఉన్నా మరణ శంఖమై మారుమోగుతాడు అని రాయడమే కవి భావనగా పేర్కొన్నారు. మృత్యు జననం అన్నది కూడా విరోధాభాసమే అని ఆయన చెప్పారు. మృత్యువు పుట్టింది అంటూ అందమైన పద ప్రయోగంగా దాన్ని రాశానని ఆయన తెలిపారు.

ఇక తిమిర నేత్రమై అవరించిన త్రినేత్రుడు అని రాశానని దాని అర్ధం లోతుగా వెళ్ళి చూస్తే చీకటిలాగా శతృవుల మీదకు ఆవరిస్తాడని వర్ణిస్తూ  ఆ తరువాత గుడ్డిగా వెళ్ళి యుద్ధం చేస్తాడనుకుంటే పొరపాటు. ఆయనకు మూడు కళ్ళు ఉన్నాయి. ఆయన త్రినేత్రుడు అందువల్ల ఆయన శతృవుకు చీకట్లు కమ్మెలా చేస్తాడు కానీ తాను మాత్రం మూడు నేత్రాలతోనూ ప్రతాపం చూపిస్తారు అని చెప్పడమే తన ఉద్దేశ్యమని అన్నారు.త‌రువాత ఇంకొక‌టి మామూలుగా మనం ఒక రంగంలోకి దూకిన త‌రువాత ఇక శ‌త్రువు మీదికి దాడి చేసేట‌ప్పుడు గుడ్డిగా వెళ్లి కొట్టేస్తుంటాం. గుడ్డిగా వెళ్లేవాడే కానీ మూడుక‌ళ్లున్నాయి. ఇది అర్థం. ఇది విరోభాభాసం ఇక్క‌డ‌. కానీ కొట్టేప్పుడు గుడ్డిగానే వెళ్తాడు కానీ గుడ్డివాడు కాదు. మూడు క‌ళ్లున్న వ్య‌క్తి. త్రినేత్రుడు తిమిర నేత్రుడు.. చీకటి క‌న్నుల వెళ్లి ఆవ‌రించేస్తాడు. దీంతో శ‌త్రువుకి అంథ‌కార‌మైపోతుంది అని అర్థం.

ఇక్కడ శివ దూషణ కానీ మరోటి కానీ లేనే లేవని చంద్రబోస్ వివరించారు. ఇది కేవలం పాటకు సంబంధించిన అలంకారం మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. అలంకారాన్ని అర్ధం చేసుకుంటే గొప్పగా ఉంటుందని ఆయన అన్నారు. సాధారణంగా  అర్ధరాత్రి సూర్యుడు అని మనం అంటాం, కానీ సూర్యుడు రాత్రి ఉదయించడు కదా అది విరోధాభాసమే అని ఆయన పేర్కొన్నారు. అలాగే నిత్యం కవితల్లో కానీ ఇతర మాటలలో కానీ వాడే ఎర్ర మల్లెలు పదం కూడా విరోధాభాసమే అని ఆయన వివరించారు. కవితంలో అదొక అంశం, దాన్ని ఆస్వాదిస్తే బాగుంటుంది అని అంటారు.

అదే విధంగా తన గీతంలో యముడు రాసే కవిత్వం అన్న పద ప్రయోగం కూడా చేశానని నిజానికి యముడు కవిత్వం రాస్తాడా అని అనిపించవచ్చునని కానీ లోతుగా చూస్తే అదొక అందమైన ప్రయోగం అన్నారు. ఇక తనంత తానే తలెత్తి చూశాడు అని రాయడం లో అర్ధం ప్రతీ మనిషిలో మానవుడు, అల్ప మానవుడు మహా మానవుడు. మామూలు మానవుడు ఉంటాడని, గొప్ప పనులు చేసినపుడు మహా మానవుడు అవుతాడని, అతన్ని తనలోని మానవుడు తలెత్తి గర్వంగా చూస్తాడు అన్న వర్ణనతోనే ఇలా రాయడం జరిగింది అని ఆయన చెప్పారు.

ఇక జై లవకుశలో కూడా పాపలాగ నవ్వుతున్న ప్రళయ భీకరా  అందమైన రూపమున్న అతి భయంకరా అంటూ విరోధాభాస అలంకారంతో పాట రాశానని చంద్రబాబు తెలిపారు.

ఇదిలా ఉండగా ప్రముఖ రచయిత యండమూరి తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడే వీడే ... తిమిరనేత్రమై ఆవరించిన త్రినేత్రుడే అని వాల్తేరు వీరయ్య పాటలో రాశారని తప్పుపట్టారు. ఇక ఆయనతో పాటు సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు దీని మీద కామెంట్స్ చేస్తున్నారు. నేత్రుడు అనగా శివమహాదేవుడు అని  ఆయన తిమిరనేత్రము అనగా చీకటి కన్నుగా కలిగినవాడు ,లేదా రోగమున్న కన్నుకలవాడు  అని ఇలా  ఏ అర్ధం తీసుకున్నా అది శివదూషణే అంటూ వారు విమర్శిస్తున్నారు.

అయితే తాను ఎక్కడా శివదూషణ చేయలేదని, సంప్రదాయ కవితంలో ఉన్న విరోధాభాసం అనే అలంకారాన్ని వాడడంతో పాటు అందమైన అనేక పద ప్రయోగాలతో పాటను ఏర్చి కూర్చాను అని చంద్రబోస్ చెప్పుకొచ్చారు. అలంకారాన్ని అర్ధాన్ని చూడాలని ఆయన కోరుతున్నారు.

సామాన్యుడి కూడ అర్థ‌మ‌య్యే స‌ర‌ళ‌మైన‌ ప‌దాల‌తో పాట‌లు రాస్తూ తెలుగు సాహిత్య చిచ్చ‌ర‌పిడుగు అనిపించుకున్నారు చంద్ర‌బోస్‌. `తాజ్ మ‌హాల్‌` నుంచి `RRR` వ‌ర‌కు ఎన్నో అత్యుత్త‌మ‌మైన పాట‌ల‌ని అందించి ఆ పాట‌ల ద్వారా స‌రికొత్త ప‌ద ప్ర‌యోగాల‌కు నాంది ప‌లికి తెలుగు సినీ సాహిత్యాన్ని వ‌న్నెతెచ్చారు. ఆయ‌న `RRR` కోసం రాసిన `నాటు నాటు` పాట ఆస్కార్ కు నామినేట్ కావ‌డం తెలిసిందే.
Tags:    

Similar News