వీడియో : మమ మాస్‌ మహేష వచ్చేశాడు

Update: 2022-06-17 08:30 GMT
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వచ్చే వారంలో ఓటీటీ ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమాలోని కళావతి మరియు మమ మహేష సాంగ్స్ ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థియేటర్లలో మమ మహేష సాంగ్ కు అభిమానులు తెగ గెంతులు వేశారు.

లిరికల్ వీడియో వచ్చిన సమయంలోనే మమ మహేష కు విపరీతమైన క్రేజ్ దక్కింది. తాజాగా ఈ పాట వీడియో ను యూట్యూబ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

మాస్ ఆడియన్స్ జాతర చేసుకునే మమ మహేష సాంగ్‌ వీడియో కోసం చాలా రోజులుగా ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్నారు. ఎట్టకేలకు మమ మహేష వీడియో సాంగ్‌ విడుదల అయ్యింది.

పాటలో మహేష్ బాబు డాన్స్‌ మరియు కీర్తి సురేష్ గ్లామర్ షో అదిరి పోయింది. సాదారణంగా మహేష్ బాబు పెద్దగా డాన్స్ లు చేయడు. కాని ఆయన ఈ పాటలో కాస్త ఎక్కువగానే కష్టపడ్డారు. మంచి స్టెప్పులతో అలరించాడు. ఫ్యాన్స్ కు కన్నుల విందు చేయడం జరిగింది. సింపుల్ గా మంచి స్టెప్స్‌ వేయడంతో అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక కీర్తి సురేష్‌ ఈ సినిమా కు ముందు వరకు చాలా పద్దతైన పాత్రల్లో.. కాస్ట్యూమ్స్ లో కనిపించింది. కాని ఈసారి మాత్రం ఈ అమ్మడి జోరు మామూలుగా లేదు. ఈ పాటలో నడుము అందాన్ని ఎక్స్ పోజ్‌ చేయడంతో పాటు.. థైస్ ను కూడా చూపిస్తూ మాస్‌ స్టెప్పులు వేసింది. గతంలో ఎప్పుడు చూడని కీర్తి సురేష్ ను ఈ పాటలో చూస్తున్నాం అంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. 


Full View
Tags:    

Similar News