MAA భ‌వంతి: ముర‌ళీమోహ‌న్ గ‌ట్టిగా ట్రై చేసుంటే..! విష్ణు స్థ‌లం ఎలా సేక‌రిస్తాడు?!

Update: 2021-07-16 04:12 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల వేళ‌ వివాదాల‌న్నీ `మా సొంత భ‌వంతి` నిర్మాణం చుట్టూనే తిరుగుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు ఆర్టిస్టుల సంఘం ద‌శాబ్ధాల పాటు మ‌నుగ‌డ సాగిస్తున్నా.. దాదాపు 950 మంది స‌భ్యుల‌తో సౌత్ లోనే అతి పెద్ద అసోసియేష‌న్ గా వెలిగిపోతున్నా కానీ `మా`కు సొంత భ‌వంతి లేక‌పోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

అయితే ఇన్నేళ్ల‌లో మా అసోసియేష‌న్ కి సొంత భ‌వంతి కోసం ప్ర‌య‌త్నాలు సాగ‌లేదా? అంటే.. ప్ర‌తిసారీ ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నా ఫెయిల‌య్యామ‌ని మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు అంగీక‌రించారు. తెలుగుదేశం ప్ర‌భుత్వం హ‌యాంలోనే ముర‌ళీమోహ‌న్ ప్ర‌య‌త్నించారు. కానీ ప‌న‌వ్వ‌లేదు. ఆ త‌ర్వాత వైయ‌స్సార్ ప్ర‌భుత్వాన్ని ముర‌ళీమోహ‌న్ మా భ‌వంతి కోసం ఎక‌రం భూమి అడిగారు. కానీ కాంగ్రెస్ డోర్స్ మూసేసింద‌ని నాగ‌బాబు తెలిపారు. కానీ ముర‌ళీమోహ‌న్ గ‌ట్టిగా ప్ర‌య‌త్నించి ఉంటే అయ్యేద‌ని కూడా అన్నారు.

సెప్టెంబ‌ర్ లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఎజెండాగా తానే స్వ‌యంగా `మా భ‌వంతి`ని నిర్మించ‌డానికి ప్ర‌తి పైసా ఇస్తాన‌ని ఎవ‌రూ ఇవ్వ‌న‌వ‌స‌రం లేద‌ని మంచు విష్ణు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనిపైనా నాగ‌బాబు స్పందించారు. మంచు విష్ణు అలా చేయ‌డం మంచిదే. కానీ స్థలం ఎలా సేక‌రిస్తారో? కూడా క్లారిటీ ఇవ్వాల‌ని నాగ‌బాబు సూటిగా ప్ర‌శ్నించారు.

నిజానికి ఏపీ తెలంగాణ డివైడ్ అనే అంశం కూడా మా సొంత భ‌వంతి నిర్మాణం ఆగిపోవ‌డానికి కార‌ణ‌మ‌ని నాగ‌బాబు న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. అప్ప‌ట్లో తాము భ‌వంతి నిర్మాణం కంటే వెల్ఫేర్ కార్య‌క్ర‌మాల వైపు మొగ్గు చూపాని తెలిపారు. తాను అధ్య‌క్షుడిగా ఉన్న‌ హ‌యాంలోనూ మా సొంత భ‌వంతి కోసం ప్ర‌య‌త్నించినా ప‌ని కాలేద‌ని తెలిపారు.

మా సొంత భ‌వంతి నిర్మాణం విష‌యంలో ప్ర‌కాష్ రాజ్ పూర్తి క్లారిటీతో ఉన్నార‌ని తెలిపారు. స్థ‌ల సేక‌ర‌ణ స‌హా ప్ర‌తిదీ ఆయ‌న‌కు ఎలా చేయాలో తెలుసున‌ని అన్నారు. ప్ర‌భుత్వం నుంచి అయ్యే ప‌నుల గురించి ఆయ‌న నాతో చెప్పారు. కానీ వాటిని బ‌య‌టికి చెప్ప‌డం స‌రికాదని అన్నారు. ఏకగ్రీవం నిర్ణ‌యం త‌ప్పు. అది స‌రికాదు. అలా అయితే దేశంలో అన్ని ఎల‌క్ష‌న్ల‌ను ఏక‌గ్రీవం చేయాల‌ని అన్నారు. ప్ర‌జాస్వామ్యంలో ఏం జ‌రుగుతోందో ప్ర‌జ‌ల‌కు తెలియాల‌ని నాగ‌బాబు వ్యాఖ్యానించారు. `మా`కు ఎన్నిక‌లు జ‌ర‌గాల‌ని ఏక‌గ్రీవం చేయ‌ద‌లిస్తే ప్ర‌కాష్ రాజ్ కోసం ఇత‌రులు త‌ప్పుకుంటే త‌ప్పేమీ కాద‌ని అన్నారు. తాను కూడా పోటీ లేకుండా ఏక‌గ్రీవం అయ్యాన‌ని గుర్తు చేసుకున్నారు. రాజ‌కీయాలు బెదిరింపులు కుట్ర‌లు ఉంటేనే ఏక‌గ్రీవం చేస్తార‌ని  మా విష‌యంలో ఎన్నిక‌లు హుందాగా జ‌ర‌గాల‌ని కోరారు.

ఎన్నిక‌ల్లో మంచు విష్ణు గెలిచినా మేమంతా స‌పోర్ట్ గా నిలుస్తామ‌ని క‌లిసిమెలిసి ప‌ని చేస్తామ‌ని నాగ‌బాబు తెలిపారు. మా మంచి కోసం అంతా క‌లిసిక‌ట్టుగా ప‌ని చేయాల‌న్నారు. ప్ర‌కాష్ రాజ్ .. విష్ణు ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని అన్నారు. విష్ణు .. మోహ‌న్ బాబు అంద‌రినీ క‌లుస్తాం. క‌లిసి ప‌ని చేస్తాం. పొద్దున్న లేచాక ఒక‌రి ముఖాలు ఒక‌రం చూసుకుంటామ‌ని సోద‌ర‌భావం ఉంటుంద‌ని నాగబాబు ఆ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

ప్ర‌కాష్ రాజ్ అధ్య‌క్షుడైతే సొంత భ‌వంతి వీజీనే?

`మా` ఎన్నిక‌లు సెప్టెంబ‌ర్ లో జ‌ర‌గనున్నాయి. ఈ సంద‌ర్భంగా అధ్య‌క్ష పోటీబ‌రిలో ఆరుగురు స‌భ్యులు నిలిచారు. దీనివ‌ల్ల వివాదాలు ముదురుతున్నాయి. ఇది సినీపెద్ద‌ల‌కు న‌చ్చ‌లేద‌ని ఈసారి ఏక‌గ్రీవం చేస్తార‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ తాజాగా నాగ‌బాబు కామెంట్ల‌ను బ‌ట్టి చూస్తే ఏక‌గ్రీవం చేస్తారా? అన్న సందిగ్ధ‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక‌వేళ ఆయ‌న కోరిన‌ట్టు ప్ర‌కాష్ రాజ్ ని ఏక‌గ్రీవం చేస్తే తెలంగాణ ప్ర‌భుత్వానికి స‌న్నిహితుడుగా అత‌డు `మా` సొంత భ‌వంతికి స్థ‌లం స‌మ‌స్య లేకుండా లైన్ క్లియ‌ర్ చేస్తారా? అన్న డౌట్ ని నాగ‌బాబు పుట్టించి వ‌దిలేశారు!!
Tags:    

Similar News