మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు అంతకంతకు హీట్ పెంచుతున్న సంగతి తెలిసిందే. మా అధ్యక్ష పదవికి ఆరుగురు పోటీపడుతున్నారు. ప్రకాష్ రాజ్- విష్ణు మంచు- జీవిత రాజశేఖర్- హేమ- సివిఎల్ నరసింహారావు -ఓ కళ్యాణ్ తదుపరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎవరికి వారు మద్ధతును కూడగట్టుకుంటున్నారు.
ప్రకాష్ రాజ్ కి మెగా కాంపౌండ్ మద్ధతు ఉంది. విష్ణు మంచుకి కృష్ణ-కృష్ణం రాజు మద్ధతు దక్కింది. సీవీఎల్ కు తెలంగాణ కళాకారుల మద్ధతు ఉంది. ఇతరులు ఎవరికి వారు తమ వర్గీయుల్ని మద్ధతు కోరుతున్నారు. అయితే నటసింహా నందమూరి బాలకృష్ణ మద్ధతు ఆ ఆరుగురిలో ఎవరికి ఉంటుంది? అంటే మంచు విష్ణుకు ఆయన మద్ధతునిస్తున్నారని ప్రచారం సాగుతోంది.
కానీ ఇంతలోనే సడెన్ ట్విస్టు. హీరో బాలకృష్ణ సీనియర్ నటి కం మహిళా దర్శకనిర్మాత జీవిత రాజశేఖర్ కు తన మద్దతునిస్తున్నారని తెలిసింది. కానీ ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది. జీవిత భర్త రాజశేఖర్ ప్రస్తుత మా అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ తో ఇంతకుముందు గొడవ పడిన సంగతి తెలిసిందే. నరేష్ వర్గం 100 ఓట్లు మంచు విష్ణుకి పడతాయని ఒక వర్గం చెబుతుంటే వివాదంతో పని లేకుండా జీవితకే పడతాయి! అంటూ ఒక వర్గం చెబుతోంది. మా ఎన్నికలు సెప్టెంబర్ లో జరగనున్నాయి. వీకే నరేష్ ఇటీవల తన పదవికి విరమణ ప్రకటించిన సంగతి తెలిసిందే.