మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీ రాజా రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ నిర్వహించాడు. తమిళ.. కన్నడ ఆర్టిసుల సంఘాల మాదిరిగా.. 'మా'కు కూడా ఓ సొంత బిల్డింగ్ ఏర్పాటు చేసుకునేందుకు ఈవెంట్స్ తలపెట్టామని.. మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరిస్తామని చెప్పారని అన్నాడు శివాజీ రాజా. ఎవరైనా హీరో రాకపోతే ఆయా అభిమానులే హర్ట్ అవుతారంటూ చెప్పుకొచ్చాడు.
అయితే.. హీరోయిన్లు ఇలాంటి ఈవెంట్లకు సపోర్ట్ చేయడం లేదనే మాట వాస్తవమే అన్న మా అధ్యక్షుడు.. ఇక్కడికొచ్చి సినిమాలు చేసుకుంటూ కోట్లు కోట్లు సంపాదిస్తున్నారని.. అయినా సరే తెలుగు సినీ పరిశ్రమకు సాయం కావాల్సి వచ్చినపుడు చేయడం లేదని అన్నాడు. మేనేజర్ల కారణంగా అంటూ కొందరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పిన శివాజీరాజా.. ఏదైనా సమస్య వస్తే మాత్రం తమ దగ్గరకు చేరుకుంటున్నారని అన్నాడు. మా సభ్యత్వం తీసుకునేందుకు ముందు అభ్యంతరాలు చెప్పిన వారికి.. ఏదైనా చెక్కు బౌన్స్ అయితే మాత్రం అపుడు సిద్ధమవుతున్నారని అన్నాడు.
ఓ చేత్తో లక్ష రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుని.. మరో చేత్తో 20 లక్షల కంప్లెయింట్ చేస్తున్నారని చెప్పాడు శివాజీరాజా. ఈవెంట్స్ కు హాజరు కావాలంటూ ప్రతీ ఒక్కరినీ అడుగుతామని.. అమ్మా అంటూ బతిమాలుతామని చెప్పిన మా ప్రెసిడెంట్.. ఒకవేళ ఎవరైనా తోక జాడించాలని అనుకుంటే మాత్రం.. నిర్దాక్షిణ్యంగా కత్తిరిస్తామని చెప్పడం హైలైట్.