మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) లుకలుకల గురించి బయటి ప్రపంచానికి తెలిసింది గోరంత.. తెలియనిది కొండంత. మా ఎన్నికల రాజకీయాలన్నీ సొంత భవంతి నిర్మాణం అనే టాపిక్ చుట్టూనే తిరుగుతున్నాయి. దానికి కారణం ఇంతకుముందు నిధి సేకరణ కార్యక్రమాలు చేపట్టడమే. మా సొంత భవంతి నిర్మించాలంటే దాదాపు 30 కోట్లు కావాలని అంచనా. తమిళనాడులో నడిగర సంఘం కోసం ఇంత పెద్ద మొత్తాన్ని వెచ్చించారు విశాల్ అండ్ టీమ్. దాంతో పోటీపడుతూ ప్రతిష్ఠాత్మకంగా తెలుగు వారి `మా` కోసం విశాలంగా ఎకరం స్థలంలో మా సొంత భవంతిని నిర్మించాలని చాలా కాలంగా కలలు కంటున్నారు.
కానీ ఇది ఎవరి హయాంలోనూ సాధ్యపడడం లేదు. మురళీమోహన్ - నాగబాబు ప్రయత్నించినా కుదరలేదు. ప్రభుత్వాలు మారినా కానీ ఎవరూ మాని పట్టించుకోలేదు. దీంతో ఫిలింఛాంబర్ లోనే ఒక గదిని అద్దెకు తీసుకుని అందులో నడిపించేస్తున్నారు.
అయితే నటుడు శివాజీ రాజా అధ్యక్షుడిగా మరోసారి మా సొంత భవంతి కోసం నిధి సేకరణ కార్యక్రమాలు నిజాయితీగా మొదలు పెట్టారు. దీనికోసం అమెరికాలో వినోద కార్యక్రమాలను ప్లాన్ చేసి తద్వారా వచ్చిన మొత్తాన్ని జమ చేశారు. అయితే ఇక్కడే నిధుల గోల్ మాల్ జరిగిందని అమెరికాకు ఫస్ట్ క్లాస్ టిక్కెట్లతో ప్రయాణించి నిధిని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. వీకే నరేష్ అప్పటి మా ఎన్నికల వేళ ఇదే విషయంపై తీవ్రంగా ఆరోపించారు.
అయితే ఇది నిజమా? కాదా? క్రమశిక్షణా కమిటీ దీనిపై విచారించిందా? అంటే ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి విచారణ జరిగిందో ఎవరికీ తెలియనేలేదు. అయితే తాజా ఇంటర్వ్యూలో నాగబాబు నాటి అధ్యక్షుడైన శివాజీరాజాకు క్లీన్ చిట్ ఇచ్చారు. శివాజీరాజా అధ్యక్షుడిగా ఉండగా అమెరికాకు వెళ్లి ఓ ప్రోగ్రామ్ ద్వారా.. మా సంఘానికి నిధిని సేకరించారు. వాటిని ఆర్టిస్టుల సంక్షేమం (వెల్ఫేర్) కోసం ఉపయోగించారు.. అని తెలిపారు.
`మా` అనేది ఒక తెల్ల కాగితం లాంటిది. ఎవరైనా వెళ్లి అకౌంట్స్ అడగవచ్చు. అక్కడ డబ్బు దుర్వినియోగం అయిందనేది కరెక్ట్ కాదు... అని నాగబాబు తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. వీకే నరేష్ అధ్యక్షుడిగా ఉండగా పెద్దగా ఎఫర్ట్ పెట్టలేదని ఏం జరిగిందో వారిని అడిగితేనే బావుంటుందని కూడా అన్నారు. మునుముందు ప్రకాష్ రాజ్ ని ఏకగ్రీవం చేసినా లేదా అతడు ఎన్నికల్లో గెలిచినా `మా` సొంత భవంతి కోసం కృషి చేస్తారని అతడు స్థల సేకరణ సహా భవంతి నిర్మాణంపై పూర్తి క్లారిటీతో ఉన్నారని కూడా నాగబాబు వ్యాఖ్యానించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మంచి పనులు చేసినా కానీ..!
నిజానికి శివాజీ రాజా కానీ వీకే నరేష్ కానీ ఆర్టిస్టుల బాగు కోసం సంక్షేమం కోసం అంతో ఇంతో ఎఫర్ట్ పెట్టిన మాట నిజమే అయినా వివాదాల వల్ల వారు చేసిన మంచి పనులకు ఫోకస్ దక్కలేదన్నది అందరికీ తెలిసిన మరో నిజం. శివాజీ రాజా హయాంలో పేద ఆర్టిస్టులకు సైకిళ్ల సాయం స్కూటర్ సాయం వగైరా జరిగాయి. పాతతరం క్లాసిక్ నటీమణులు సీనియర్లకు సన్మాన సత్కార కార్యక్రమాలను విధిగా నిర్వహించారు.
కానీ గొడవల వల్ల `మా` ఇబ్బందుల్లో పడింది. మా ప్రతిష్ఠ మంట కలిసిందని నాగబాబు ఇంతకుముందు వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా కొనసాగుతున్న వివాదాలపై మాత్రమే తాను వ్యాఖ్యానించానని ఆయన తాజా ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. తాను వీకే నరేష్ కి వ్యతిరేకిని కానని కూడా తెలిపారు. కానీ తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకుని వీకే నరేష్ బాధపడ్డారని నాగబాబు అన్నారు.