సర్దార్ శాటిలైట్.. బేరమాడుతున్న ఛానల్

Update: 2016-04-16 11:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ ఒకవైపు రికార్డులు సృష్టిస్తూ, నాన్ బాహుబలి రికార్డులు సాధిస్తున్నా.. ఈ మూవీ భారీ నష్టాలను మిగల్చనుందన్న మాట వాస్తవమే. ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ ని నిరాశ పరచిన సర్దార్ కి.. ఇప్పుడు శాటిలైట్ విషయంలో కొత్త చిక్కు వచ్చింది. నిజానికి సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ శాటిలైట్ హక్కులను మా టీవీ గతంలోనే కొనేసింది.

పవన్ స్టామినాని నమ్మి ఏకంగా 13 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఛానల్. ఇప్పుడు సినిమా నిరాశపరచడంతో.. టీవీ వ్యూయర్ షిప్ పై కూడా ఎక్కువగా ఆశలు లేవు. అందుకే సర్దార్ శాటిలైట్ హక్కుల రేటు విషయంలో బేరానికి దిగుతోందిట మాటీవీ. 13 కోట్లలో కొంతమొత్తం డిస్కౌంట్ ఇవ్వాల్సిందిగా నిర్మాతను, ప్రత్యేకించి పవన్ ను అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మాత శరత్ మరార్.. గతంలో ఇదే మా ఛానల్ కు సీఈఓ. అందుకే ఈ విషయంలో పాజిటివ్ గా రియాక్షన్ వచ్చే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు.

అయితే.. సర్దార్ విషయంలో రేట్ ని యథాతథంగా ఉంచుదామని, పవన్ నెక్ట్స్ పిక్చర్ ని మాత్రం తక్కువ రేట్ కి కోట్ చేయించి ఇస్తానని ప్రామిస్ చేశాడట శరత్ మరార్. దీంతో ఆ ఛానల్ కి ఒప్పుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. మొత్తానికి శాటిలైట్ రేట్ విషయంలో డిస్కౌంట్ వివాదానికి అలా ముగింపు పలికాడు సర్దార్ నిర్మాత.
Tags:    

Similar News