గతంలో ఒక సూపర్ హిట్ సినిమా బుల్లితెరపై ప్రత్యక్షం కావడానికి మినిమమ్ ఏడాదన్నా పట్టేది. అయితే ఇప్పుడు గుణాంకాలు మారిపోయాయి. విడుదలైన 50రోజులలోపే సినిమా టి.వి లలో ప్రత్యక్షమవుతుంది. నాగచైతన్య 'ఒక లైలా కోసం' ఇటీవల కాలంలో అత్యంత వేగంగా వెండితెర నుండి బుల్లితెరకు మారిన చిత్రంగా నిలిచింది. బాహుబలి వంటి భారీ సినిమాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. 100రోజుల తరువాత ఈ సినిమా కూడా బుల్లితెర ప్రేక్షకులను పలకరించేసింది.
కాబట్టి ఇటువంటి బడా చిత్రాలకు ఇప్పుడు శాటిలైట్ హక్కులు కీలకంగా మారాయి. సినిమా విడుదలకు ముందే మంచి ధరలకు టి.వి ఛానళ్ళు ఈ హక్కులను సొంతం చేసుకుంటున్నాయి. అయితే ఇందులో విశేషమేమిటంటే దాదాపు అన్ని పెద్ద చిత్రాల హక్కులను 'మా' టి.వి సంస్థ మాత్రమే చేజిక్కించుకోవడం. తెలుగునాట మా కంటేముందు మరో రెండు పెద్ద ఛానళ్ళు వున్నా మూవీ విషయంలో మా వాటిని పక్కకునెట్టేస్తుంది. ఇండస్ట్రీలో వున్న కాంటాక్ట్స్ ఏ దీనికి కారణమని అర్ధమవుతుంది.
మొన్న బాహుబలి తరువాత రీసెంట్ గా కంచె సినిమా హక్కులను కూడా నాలుగున్నర కోట్లకు కొనుగోలుచేసింది. ఈ ప్రకారం నయా మూవీ అంటే మా టి.వి లోననే ఫిక్స్ అయిపోవాలేమో.