'మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం' ఫ‌స్ట్ రిపోర్ట్‌!

Update: 2022-08-12 06:00 GMT
యంగ్ హీరో నితిన్ న‌టించిన హై వోల్టేజ్ పొలిటిక‌ల్‌ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం'. ఎడిట‌ర్ ఎం.ఎస్‌. రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఈ మూవీ ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. క్రితిశెట్టి, కేథ‌రిన్ హీరోయిన్ లుగా న‌టించారు. శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ద‌ర్శ‌కుడి వివాదాస్ప‌ద ట్వీట్ ల‌ కార‌ణంగా వార్త‌ల్లో నిలిచి వివాదంగా మారిన ఈ మూవీ ఆ త‌రువాత రిలీజ్ డేట్, థియేట‌ర్ల అడ్జ‌స్ట్ మెంట్ ల స‌మ‌స్య‌ల కార‌ణంగానూ వార్త‌ల్లో నిలిచింది.

నితిన్ కెరీర్ కు అత్యంత కీల‌కంగా నిలిచిన ఈ మూవీపై నితిన్ కూడా భారీ ఎక్స్ పెక్టేష‌న్స్ పెట్టుకున్నాడు. ఈ నేప‌థ్యంలో భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ మూవీని ఆగ‌స్టు 12న భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. ఇదిలా వుంటే యుఎస్ ప్రీమియ‌ర్స్ పూర్త‌యిపోవ‌డంతో మూవీ టాక్ ఏంట‌న్న‌ది బ‌య‌టికి వ‌చ్చేసింది. యుఎస్ ప్రీమియ‌ర్ టాక్ ని బ‌ట్టి ఈ మూవీ రొటీన్ ల‌వ్ స్టోరీకి రాజ‌కీయ అంశాల‌ని జోడించి అర్థం లేని కామెడీ స‌న్నివేశాల‌తో తెర‌కెక్కించిన‌ట్టుగా తెలుస్తోంది.

ఫ‌స్ట్ హాట్ రొటీన్ ల‌వ్ స్టోరీతో న‌రేష‌న్ కూడా చాలా బోరింగ్ వుంద‌నే టాక్ బ‌య‌టికి వ‌చ్చింది. ఈ మూవీ ట్రైల‌ర్ లో చూపించిన స‌న్నివేశాలు, డైలాగ్ లు ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో సినిమాల్లో క‌నిపించిన‌వే, అవే మాస్ ఫైట్స్‌, అవే మాస్ డైలాగ్స్‌.. విల‌న్, హీరో మ‌ధ్య సాగే కాన్‌ఫ్లిక్ట్ .. స‌గ‌టు ప్రేక్ష‌కుడు కూడా ఊహించే క‌థ‌, క‌థ‌నాలు ఈ మూవీకి ప్ర‌ధాన బ‌ల‌హీన‌త‌లుగా మారిన‌ట్టుగా చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ మ‌రింత సాగ‌దీసేలా వుంటుంద‌ని ముందే హింట్ ఇచ్చేస్తుంద‌ట‌. ఇక ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌, పంచ్ డైలాగ్ కూడా ఊహించిన విధంగా వుండ‌టం, ఎలివేష‌న్స్ కూడా విసుగు తెప్పించేలా వున్నాయ‌ట‌.

ఇక సెకండ్ హాఫ్ క‌థ లోకి వెళితే సేమ్ రొటీన్ యాక్ష‌న్ స్టోరీ అని తెలిసిపోతోంద‌ట‌. సాంగ్స్ కూడా ఏమంత ఆస‌క్తిక‌రంగా క‌థ‌కు అనుగుణంగా లేవ‌ని తెలుస్తోంది. కామెడీ స‌న్నివేశాలు కాస్త ఇరిటేటింగ్ గా వున్నాయ‌ని, ఇవే స‌న్నివేశాల‌ని సెకండ్ హాఫ్ లోనూ కంటిన్యూ చేయించి ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రిక్షించాడ‌ని అంటున్నారు. సినిమా మొత్తంలో ప్రేక్ష‌కులు రిలీఫ్ గా ఫీల‌య్యే సంద‌ర్భాలు రెండే రెండున్నాయ‌ట‌. అవి అంజ‌లి,నితిన్ పై వ‌చ్చే 'రారా రెడ్డి'.. 'విక్ర‌మ్‌' సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ చెప్పే డైలాగ్ ని నితిన్ చెప్ప‌డం.. బీజీఎమ్ మాత్ర‌మే ఆక‌ట్టుకునే విధంగా వున్నాయ‌ట‌.

ఓవ‌రాల్ గా యుఎస్ రిపోర్ట్ ని బ‌ట్టి 'మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం' ఓ బోరింగ్ రొటీన్ యాక్ష‌న్ డ్రామా అని స్ప‌ష్ట‌మ‌వుతోంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు చెప్పుకోద‌గ్గ స‌న్నివేశాలు, కానీ ఆహా ఓహో అనే సీన్స్ గానీ లేవని, సినిమా అంతా స‌గ‌టు ప్రేక్ష‌కుడి స‌హ‌నాన్ని ప‌రీక్షించేలా వుంద‌ని చెబుతున్నారు. తుపాకీ రివ్యూ కోసం వెయిట్ చెయ్యండి
Tags:    

Similar News