నితిన్ మొదటి నుంచి కూడా లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కలిసిన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఈ సారి ఆయన పొలిటికల్ డ్రామాతో కూడిన మాస్ యాక్షన్ కథను నమ్ముకున్నాడు. 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలో ఆయన కలెక్టర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్రను పోషించడం నితిన్ కెరియర్లో ఇదే ఫస్టు టైమ్.
నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎడిటర్ గా మంచి అనుభవమున్న రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ఇటీవల కాలంలో ప్రతి సినిమాకి ముందు ఆ టీమ్ ని బిత్తిరి సత్తి చేసే ఇంటర్వ్యూ బాగా కలిసొస్తోంది. అలా ఈ సినిమా టీమ్ ను బిత్తిరిసత్తి ఇంటర్వ్యూ చేశాడు. "పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాజశేఖర్ రెడ్డి నాకు ఒక కథను చెప్పాడు. వినగానే నాకు కొత్తగా అనిపించింది.
ఈ సినిమాలో నా పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందనే విషయం అర్థమైంది. సిద్ధు అనే ఐఏఎస్ అధికారి పాత్రను నేను పోషించాను. ఇలాంటి ఒక పాత్రను ఇంతవరకూ చేయలేదు. కమర్షియల్ మీటర్లో వెళ్లే సినిమా కావడంతో, కథ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.
'లుక్ పరంగా పెద్దమనిషి లుక్ రావడానికి ఎన్ని తిప్పలు పడ్డవ్?' అని బిత్తిరి సత్తి అడగ్గానే నితిన్ స్పందిస్తూ . "మీసాలు పెంచాను.. దాంతో పెద్దగైపాయే" అన్నాడు. 'అందుకు ఎంత టైమ్ పట్టింది .. మూడు .. నాలుగు నెలలు పట్టిందా?' అని బిత్తిరి సత్తి అడగ్గా, ఒక నెల మాత్రమే తీసుకున్నా అంటూ నితిన్ సమాధానమిచ్చాడు. 'ఒక్క నెలలలోనే పెద్ద మనిషి లెక్క అయిపోయినవన్న మాట' అని బిత్తిరిసత్తి తనదైన ధోరణిలో అనగానే నితిన్ నవ్వేశాడు.
మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికే వదిలిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అంజలి ఐటమ్ సాంగ్ జనంలోకి దూసుకుపోయింది. నితిన్ సరసన కథానాయికలుగా కృతి శెట్టి - కేథరిన్ అలరించనుండగా, రాజేంద్రప్రసాద్ .. సముద్రఖని .. వెన్నెల కిశోర్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తన సినిమాల ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన కొరియోగ్రఫర్స్ అందరికీ కూడా నితిన్ ఈ సినిమాలో ఛాన్స్ ఇవ్వడం విశేషం.